90% దర్శనం వారికే..: సర్వ దర్శన క్యూలైన్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రారంభం అయ్యే వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా లక్షలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే తొలి మూడు రోజుల కోసం మొత్తం 1,76,000 మంది భక్తులను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఎంపిక చేశారు.
ఈ ఏర్పాట్లను తాజాగా వంగలపూడి అనిత, అనగాని సత్య ప్రసాద్, ఆనం రామనారాయణరెడ్డితో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సమీక్షించింది. మంత్రివర్గ ఉప సంఘం సమీక్షించింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, దేవాదాయశాఖ కార్యదర్శి హరి జవహర్ లాల్, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్వో మురళీ కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామన్యులకే పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. 10 రోజుల్లో 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు అంటే దాదాపు 90 శాతం సామాన్యులకే కేటాయించామని వివరించారు. తొలి మూడు రోజుల దర్వనాలకు 27 రాష్ట్రాల నుండి 23.64 లక్షల మంది ఈ-డిప్ కు నమోదు చేసుకోగా.. 1.89 లక్షల మంది సామాన్య భక్తులకు ఈ-డిప్ ద్వారా టోకెన్ల అందజేశామని అన్నారు.
భక్తులు ఏ రోజు, ఏ సమయానికి దర్శనానికి రావాలో సమాచారం అందజేస్తామని ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. టోకెన్ లేని భక్తులు జనవరి 2 నుండి 8వ తేది వరకు సర్వ దర్శన క్యూలైన్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలకు అవకాశం కల్పిస్తామని అన్నారు. స్వామివారి దర్శనాలకు విచ్చేసే భక్తులకు విరివిగా అన్నప్రసాదాలను అందజేస్తామని పేర్కొన్నారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పర్యవేక్షణ సాగుతుందని, భక్తుల సంఖ్య, వేచి ఉండే సమయాన్ని అంచనా వేస్తూ క్యూలైన్లను నిర్వహిస్తామని తెలిపారు. పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సమన్వయంతో భక్తులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు. అన్ని వర్గాల భక్తులను దృష్టిలో ఉంచుకుని సంయమనంతో స్వామివారిని దర్శించుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications