KIA Cars: ఏపీ కియా కార్ ప్లాంట్లో భారీ చోరీ..! ఏకంగా 900 ఇంజన్లు మాయం..!

KIA Cars: మన దేశంలోనే కియా కార్ల తయారీలో టాప్ లో ఉన్న సత్యసాయి జిల్లా ప్లాంట్ లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కియా కార్ల తయారీలో విడిభాగాల రవాణా సమయంలో దొంగలు ఏకంగా 900 కారు ఇంజన్లను ఎత్తుకెళ్లిపోయారు. దీంతో నివ్వెరపోవడం యాజమాన్యం వంతయింది. తొలుత పోలీసులతో రహస్యంగా దర్యాప్తు చేయించాలని చూసిన యాజమాన్యం.. ఆ తర్వాత అధికారికంగా ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు జరుగుతోంది.

సత్యసాయి జిల్లాలోని పెనుకొండ మండలం యర్రమల్లి పంచాయతీలో కియా కార్ల పరిశ్రమ ఉంది. దీన్ని గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎంగా ఉన్న చంద్రబాబు చొరవతో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ కార్ల పరిశ్రమ అక్కడ ఉత్పత్తి చేస్తోంది. అయితే ప్రధాన ప్లాంట్ వేరుగానూ, కార్ల విడిభాగాలు తయారు చేసే అనుబంధ పరిశ్రమలు వేర్వేరుగా ఉన్నాయి. ఇలా అనుబంధ పరిశ్రమల్లో తయారైన విడి భాగాల్ని ప్రధాన ప్లాంట్ కు తీసుకొచ్చి జత చేస్తుంటారు. ఈ క్రమంలోనే 900 కార్లు మాయమైన ఘటన చోటు చేసుకుంది.

900 kia car engines stolen from plant in satya sai district in Andhra pradesh

గత నెల 19నే ఈ విషయాన్ని గుర్తించిన కియా ప్లాంట్ యాజమాన్యం పోలీసులకు అనధికారికంగా ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం బయటపడితే పరువు పోతుందని భావించి ఇలా చేసింది. అయితే అధికారికంగా ఫిర్యాదు చేయకుండా తాము దర్యాప్తు చేయడం కష్టమవుతుందని పోలీసులు వారికి తేల్చిచెప్పడంతో ఆ తర్వాత అధికారికంగానే ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో సంస్థ మాజీ ఉద్యోగులే వీటిని ఎత్తుకెళ్లి ఉంటారని తేలింది. దీంతో వారి కోసం గాలింపు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+