ఆకతాయిల వేధింపులు: యువతి ఆత్మహత్య

 10th student commits suicide in Guntur district
గుంటూరు/కడప: జిల్లాలోని క్రోసూరు మండలం అనంతవరంలో ఆకతాయిల వేధింపులకు ఓ 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా ఉంటున్న ముగ్గురు యువకులు గత కొంతకాలంగా శ్రీలక్ష్మిపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఆదివారం రాత్రి ఒక యువకుడు వచ్చి తనతో ఫోన్‌లో మాట్లాడాలని బలవంతం చేశాడు. ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మి తండ్రి అక్కడకు రావడంతో ఘర్షణ చోటు చేసుకుంది.

తన మూలంగా గొడవలు జరుగుతున్నాయని, ఊరిలో పరువుపోయిందని భావించిన శ్రీలక్ష్మి తీవ్ర మనస్తాపానికి లోనై.. రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయిన సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. పెద్దగా మంటలు రావడంతో మేల్కొన్న కుటుంబసభ్యులు శ్రీలక్ష్మిని హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

శ్రీలక్ష్మి చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతిచెందింది. దీనికి ముగ్గురు యువకులే కారణమని కుటుంబ సభ్యులు పేర్కొంటూ క్రోసూరు పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. పరారిలో ఉన్న ముగ్గురు యువకులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మహిళ అనుమానాస్పద మృతి

కడప: జిల్లాలోని రాజంపేట మండలంలోని బోయినపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం అర్ధరాత్రి ఓ గుర్తు తెలియని మహిళ(22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సోమవారం ఉదయం పాఠశాల మైదానానికి వచ్చిన యువకులు ఈ విషయాన్ని గమనించి మన్నూరు పోలీసులకు సమాచారం అదించడంతో అక్కడి చేరుకున్నారు. దుండగులు ఆమె మెడకు ఉరివేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం వద్ద చీర, టవల్ తోపాటు రీఛార్జ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+