క్షుద్రపూజల కోసం కన్న కొడుకునే బలిచ్చాడు(పిక్చర్స్)
ప్రకాశం: ఓ దుర్మార్గపు తండ్రి క్షుద్ర పూజల కోసం కన్న కొడుకునే బలిచ్చిన దారుణ ఘటన సోమవారం ఒంగోలులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒంగోలు నగరం వెంగముక్కపాలెం రోడ్డులోని మదర్ థెరిస్సా కాలనీకి చెందిన సిద్ది రాజారెడ్డి అలియాస్ దెయ్యాల రాజారెడ్డి(50) క్షుద్రపూజలు చేస్తుంటాడు.
రెండేళ్ల కిందట మతి స్థిమితం లేని మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి నెల కిందట మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డకు పక్కింట్లోని బాలింత కళావతి తన స్తన్యాన్నిచ్చి ఆకలి తీర్చేది. ఇలా పాలివ్వడానికి వచ్చిన ఆమెకు పసిబిడ్డ కనిపించలేదు.
రాజారెడ్డిని నిలదీసినా ఫలితం లేకపోవడంతో స్థానికులు వచ్చి దేహశుద్ధి చేశారు. దీంతో బిడ్డను తానే చంపానని మూలన పడేసిన మృతదేహాన్ని చూపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

కొడుకునే బలిచ్చాడు
ఓ దుర్మార్గపు తండ్రి క్షుద్ర పూజల కోసం కన్న కొడుకునే బలిచ్చిన దారుణ ఘటన సోమవారం ఒంగోలులో చోటు చేసుకుంది.

కొడుకునే బలిచ్చాడు
వివరాల్లోకి వెళితే.. ఒంగోలు నగరం వెంగముక్కపాలెం రోడ్డులోని మదర్ థెరిస్సా కాలనీకి చెందిన సిద్ది రాజారెడ్డి అలియాస్ దెయ్యాల రాజారెడ్డి(50) క్షుద్రపూజలు చేస్తుంటాడు.

విగతజీవిగా చిన్నారి
రెండేళ్ల కిందట మతి స్థిమితం లేని మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి నెల కిందట మగబిడ్డ జన్మించాడు.

నిందితులు
ఆ బిడ్డకు పక్కింట్లోని బాలింత కళావతి తన స్తన్యాన్నిచ్చి ఆకలి తీర్చేది. ఇలా పాలివ్వడానికి వచ్చిన ఆమెకు పసిబిడ్డ కనిపించలేదు.

క్షుద్రపూజలు
రాజారెడ్డిని నిలదీసినా ఫలితం లేకపోవడంతో స్థానికులు వచ్చి దేహశుద్ధి చేశారు. దీంతో బిడ్డను తానే చంపానని మూలన పడేసిన మృతదేహాన్ని చూపించాడు.

ఘటనా స్థలం
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications