Diwali 2022: టపాసులు పేలి బాలుడు మృతి.. సరోజినీదేవి కంటి ఆస్పత్రికి పేషెంట్ల తాకిడి..
దీపావలి పండుగ అంటే మనకు మొదట గుర్తొచ్చేది టపాసులు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు టపాసులు పేల్చుతుంటారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా బాణాసంచ పేలిస్తే ప్రమాదాలు జరుగుతాయి. తాజాగా ఏపీలోని మచిలీపట్నం శివారు నవీన్ మిట్టల్ కాలనీలో సీతానగర్‌లో టపాసులు పేలి 11 ఏళ్ల బాలుడు చనిపోయాడు.టపాసులు ఆరబెడుతుండగా అవి ఒక్కసారిగా పేలాయి. దీంతో పక్కనే ఉన్న ద్విచక్ర వాహనంపై నిప్పులు పడటంతో ట్యాంక్ అంటుకుని వాహనానికి మంటలు అంటుకుని బాలుడి కాలిపోయాడు. బాలుడిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించిగా పరిస్థితి విషమించి బాలుడు మృతి చెందాడు.
50 కేసులు
ఇటు హైదరాబాద్ లో కూడా టపాసులు పేలి గాయపడ్డారు.బాణాసంచ పేల్చుతున్నప్పుడు గాయపడిన వారితో మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రికి కిటకిటాలడింది. వీరిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారు. సోమవారం రాత్రే 10 కేసులు హాస్పిటల్ కు వచ్చాయని అక్కడి సిబ్బంది తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం వరకు దాదాపు 50 కేసులు నమోదు కాగా.. 12 మందిని హాస్పిటల్ లో చేర్చుకుని చికిత్స చేస్తున్నారు.

నిర్లక్ష్యం
టపాసులు కాల్చుతూ గాయపడి ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.టపాసులు పేల్చేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే.. తర్వాత ప్రమాదాలు తప్పవని చెబుతున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వం కంటీ, ఈఎన్టీ ఆస్పత్రుల్లో సిబ్బందిని అప్రమత్తం చేసింది.












Click it and Unblock the Notifications