దేశంలోనే తొలిసారి సరోగసీ పద్ధతిలో కోడెదూడ జననం..
దేశంలోని తొలిసారిగా సరోగసీ ద్వారా ఓ నాటు ఆవుకు పుంగనూరు జాతికి చెందిన కోడె దూడ జన్మించింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు సమీపంలోని శెట్టిగుంటలో ఈ ఘటన వెలుగుచూసింది.
శెట్టిగుంట గ్రామానికి చెందిన హరి అనే రైతు ఆవుకు సరోగసి పద్ధతిలో కోడెదూడ జన్మించింది. చింతలదీవి పశుక్షేత్రం నుంచి పుంగనూరు జాతి పిండాన్ని రైతు హరికి చెందిన నాటు ఆవు గర్భంలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే, ఆ నాటు ఆవు ఆదివారం రాత్రి సమయంలో పుంగనూరు జాతికి చెందిన కోడెదూడకు జన్మినిచ్చింది. ఈ విషయన్నా స్వయంగా పశువైద్యులు డాక్టర్ ప్రతాప్ తెలిపారు.

ఈ ప్రక్రియ రూ. 5వేల నుంచి పదివేల రూపాయల వరకూ ఖర్చవతుందని ఆయన వెల్లడించారు. పిండమార్పిడి విధానం ద్వారా కావాల్సిన పశువుల సంతతి వృద్ధి చేసుకోవచ్చని పశువైద్యుడు తెలిపారు. సరోగసి ద్వారా ఓ ఆవు కోడెదూడకు జన్మినివ్వడం ఇదే దేశంలో తొలిసారి. గత సంవత్సరం ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడ జన్మించిన విషయం అందరికీ తెలిసిందే. ఈసారి నాటు ఆవు గర్భంలో సరోగసి విధానంలో పిండమార్పిడి చేసి మేలుజాతి పుంగనూరు దూడకు జన్మనిచ్చింది.
తొలిసారి ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్సఫర్ విధానంలో కోడెదూడ జననం..
చింతలదీవి పశు క్షేత్రంలో అభివృద్ధి చేసిన ఏడు రోజుల వయస్సున్న ఘనీకృత పుంగనూరు జాతి పిండాన్నితెచ్చారు. ఆ పిండాన్ని శెట్టిగుంట గ్రామానికి చెందిన పమిడిగంటం హరిరావుకు చెందిన నాటు ఆవు గర్భంలో ప్రవేశపెట్టారు. ఈ ప్రక్రియ మార్చి 4, 2023న స్థానిక పశువైద్యుడు డాక్టర్ ప్రతాప్ స్వయంగా ప్రవేశపెట్టారు. మే 25న ఈ నాటు ఆవు చూలు కట్టింది.
చూలుకాలంలో పశువు ఆరోగ్య పరిరక్షణ కోసం రూ.2,500 విలువైన దాణా, ఖనిజ లవణాలతో కూడిన మేతను ఆర్బీకే ద్వారా ఉచితంగా అందజేస్తారు. అయితే, ఈ సమయంలో నాటు ఆవు డిసెంబర్ 17వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో మేలుజాతి పుంగనూరు జాతి కోడెదూడెకు జన్మనిచ్చింది. కోడెదూడ చాలా ఆరోగ్యంగా ఉందని పశువైద్యులు ప్రతాప్ తెలిపారు. దేశంలోనే తొలిసారి ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్సఫర్ విధానంలో పుంగనూరు కోడెదూడ జన్మించింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications