పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు.. బస్సు యాత్రలో ఆ ఘటన ఎఫెక్ట్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు తీరు సామాన్య ప్రజలకు విస్మయాన్ని కలిగిస్తోంది. చిన్నచిన్న కార్యక్రమాలలో ఘర్షణలు చోటు చేసుకోవడం, గొడవలకు దిగటం పరిపాటిగా మారిపోయింది. ఏ కార్యక్రమం జరిగినా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యటం, చెప్పులు చూపించటం ప్రధానంగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుండే ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్న నాయకులు అప్పుడే ఎన్నికల వేడిని పుట్టిస్తున్నారు.

ఇక ఏపీలో ప్రతినిత్యం రాజకీయ నాయకులపై నమోదవుతున్న కేసులు అక్కడ ప్రస్తుతం కొనసాగుతున్న పొలిటికల్ హీట్ కు అద్దం పడుతున్నాయి. తాజాగా టిడిపి ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ పై సత్యసాయి జిల్లా కనగానపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైంది. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్రలో జరిగిన ఒక సంఘటన పై ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

A case has been registered against Paritala Sriram with bus yatra incident

దీంతో పోలీసులు పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ బస్సు యాత్రను సాగిస్తున్న పరిటాల శ్రీరామ్ సోమవారం నాడు కనగానపల్లి మండలం రాంపురం గ్రామంలో బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఆ సమయంలో టిడిపి బస్సులో ఉన్న వడ్డే ధనమ్మ తన సోదరి రామకృష్ణమ్మకు చెప్పు చూపించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చెప్పుతో కొడతా అని బెదిరించిందని వడ్డే రాఘవేంద్రా అనే వ్యక్తి కనగానపల్లి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు. ధనమ్మకు మద్దతుగా పరిటాల శ్రీరామ్ తో పాటు మరో నలుగురు తన సోదరిని దూషించారని, బెదిరింపులకు పాల్పడ్డారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో పోలీసులు పరిటాల శ్రీరామ్ తో పాటు వడ్డే ధనమ్మ, తూంచెర్ల హరి, కుర్లపల్లి చంద్ర, రాజు తదితరులపై కేసు పెట్టారు. టీడీపీ నాయకులను ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెడుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+