వాగులో పడి బాలుడు మృతి: కాపాడబోయి పిన్ని కూడా..
గుంటూరు జిల్లాలోని గురజాల నియోజక వర్గం రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
గుంటూరు: జిల్లాలోని గురజాల నియోజక వర్గం రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గుంటూరుకు చెందిన నీలం రోజా, రోజా అక్క కొడుకు బన్ను అనే ఇద్దరూ భంధువుల ఇంటికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు. రోజా, బన్ను మరికొంత మంది బంధువులు దసరా సెలవులు నిమిత్తం రెంటచింతల మండలం రెంటాలలో ఓ శుభకార్యానికి హాజరయ్యారు.
అక్కడ శుభ కార్యక్రమం అయిపోయిన రోజునే అందరూ గుంటూరు తిరిగిరావాల్సి ఉండగా, బంధువులు తాము ఈ ఏడాది పొలంలో నిమ్మ మొక్కలు నాటాం చూసి రేపు ఊరికి వెళ్ళవచ్చు ఉండమని చెప్పడంతో, అక్కడే ఉండి పోయారు. ఇక ఈ రోజు ఉదయం అనంతరం నిమ్మ తోటను చూసి వెనుదిరిగి వస్తున్నారు. వీరు వచ్చే మార్గంలో ఏడు మంగళం వాగు ఉంది.

ఈ మధ్యనే ఈ వాగుకు ఉపాధి హామీ పనుల్లో భాగంగా లోతు తవ్వి కట్టలు బలపరిచేందుకు పోత మట్టి, పూడిక మట్టి గట్లపై పోశారు. ఈ గట్టుపై నడుస్తూ బన్ను(7) అనే పిల్లవాడు వాగులో జారిపడ్డాడు. ఇంతలో ఆ పిల్లవాడిని కాపాడబోయి నీలం రోజా(26) అనే మహిళ కూడా ఆ వాగులో జారిపడింది.
ఇద్దరికీ ఈత రాని కారణంగా ఎవరూ ప్రాణాలు కాపాడుకోలేక పోయారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications