వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: జగన్ ఇంటి వద్ద దంపతుల సూసైడ్ అటెంప్ట్ -సీఎంను కలవనీయలేదని మనస్తాపంతో..

|
Google Oneindia TeluguNews

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం, క్యాంప్ ఆఫీస్ కూడా అయిన భవంతి వద్ద బుధవారం షాకింగ్ దృశ్యాలు చోటుచేసుకున్నాయి. సీఎం ఎక్కువ సమయం గడిపే ఆ కార్యాలయానికి సమీపంలో గల భరతమాత విగ్రహం వద్ద దంపతులు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలంరేపింది. పోలీసులు చెప్పిన వివరాలివి..

బోర్లా పడ్డ రఘురామ -చంద్రబాబుకూ శిక్ష -డా.సుధాకర్ తీరన్న సాయిరెడ్డి -సుప్రీంకోర్టుకు చేరిన తెలంగాణ రిపోర్ట్బోర్లా పడ్డ రఘురామ -చంద్రబాబుకూ శిక్ష -డా.సుధాకర్ తీరన్న సాయిరెడ్డి -సుప్రీంకోర్టుకు చేరిన తెలంగాణ రిపోర్ట్

కృష్ణా జిల్లాకు చెందిన నరేష్, సరస్వతి దంపతులు బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్‌ను కలుస్తామని వారు సెక్యురిటీ సిబ్బందిని కోరగా, కోవిడ్ కారణంగా అపాయింట్మెంట్ కుదరదని చెక్ పోస్ట్ సిబ్బంది చెప్పారు. అయితే, సీఎంను ఏ పని మీద కలవాలనుకుంటున్నారో సంబంధిత వినతి పత్రాన్ని ఇస్తే లోనికి పంపుతామని సిబ్బంది సూచించారు. దీంతో..

A couple from krishna dist commits suicide at CM YS Jagan camp office, police rescued

సెక్యూరిటీ సిబ్బంది సమాధానంతో సీఎంను కలవనీయలేదని మనస్తాపానికి గురైన ఆ దంపతులు ఒక్కసారిగా పెట్రోల్ పోసుకునే యత్నం చేయగా చెక్ పోస్టు సిబ్బంది అడ్డుకున్నారు. తొలుత వారిని తాడేప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించినా, బాధిత మహిళ సరస్వతికి ఫిట్స్ ఉండటంతో ఆమెను తాడేపల్లి‌లోని ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో చేర్పించారు. కాగా,

మోదీ పరువు తీసిన గడ్కరీ -వ్యాక్సిన్ల కొరతపై సంచలనం -కేంద్రం ఏం చేస్తున్నదో తెలీదని వ్యాఖ్యమోదీ పరువు తీసిన గడ్కరీ -వ్యాక్సిన్ల కొరతపై సంచలనం -కేంద్రం ఏం చేస్తున్నదో తెలీదని వ్యాఖ్య

కుటుంబం ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి సహాయం అర్థించేందుకే నరేష్-సౌందర్య దంపతులు వచ్చినట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని.. సీఎం జగన్ స‌హాయం కోసం వ‌చ్చిన‌ట్లు దంప‌తులు చెబుతున్నార‌ని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విరాలు తెలియాల్సి ఉంది.

English summary
In a strange incident, a couple from the Krishna district have attemted suicide near the camp office of andhra Chief Minister YS Jagan Mohan Reddy. As per media reports, Naresh and Saraswati came to the CM’s camp office in Tadepalli, as their family financial situation was worsened. The couple asked security personnel to allow them to meet CM Jagan. However, the officials halted them saying they could not meet the CM because of Covid-19 protocols. The police said they would hand over the notice to the CM if given.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X