అనుమానాస్పదస్థితిలో భార్యాభర్తల మృతి

A couple suspiciously died in Visakhapatnam
విశాఖపట్నం: అనుమానాస్పదస్థితిలో నగరానికి చెందిన భార్యాభర్తలిద్దరు మృతి చెందారు. ఈ ఘటన ఎన్‌ఎడి కొత్తరోడ్డు సమీపంలోని గణేష్‌నగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నమ్మి వెంకటేశ్వరరావు(47) పాల వ్యాపారం చేస్తూ భార్య పద్మ (38), ఇద్దరు కుమారులు, కుమార్తెతో కలిసి జీవనం సాగిస్తున్నారు. మంగళవారం రాత్రి కుమారులిద్దరు గోపాలపట్నంలోని సినిమాకు రెండో ఆటకు వెళ్లగా కుమార్తె వరండాలో నిద్రపోయినట్టు పోలీసులు తెలిపారు.

కరెంట్ లేకపోవడంతో వంట గదిలోని జనరేటర్‌ను ఆన్‌చేసి ఇంటి తలుపులు మూసి వేసి భార్యాభర్తలిద్దరు వంట గది సమీపంలోని బెడ్‌రూమ్‌లో పడుకున్నారు. ఈ తరుణంలో సినిమాకు వెళ్లిన కుమారులిద్దరు అర్థరాత్రి సమయంలో ఇంటికి రాగ వరండాలో పడుకున్న చెల్లెలు తలుపు తీసింది. అమ్మనాన్న పడుకున్న గదిలో నుండి దట్టమైన పొగలు రావడంతో కుమారులిద్దరు తలుపు కొట్టగా, ఎంత సేపటికి వారిద్దరు తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి వెంటనే వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు అక్కడకు చేరుకుని తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా వెంకటేశ్వరరావు మంచం మీద విగతజీవిగా పడి ఉండడాన్ని గమనించారు. దగ్గరలోని బాత్‌రూమ్‌లో అతని భార్య పద్మ కిందపడి మృతి చెంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కుమారులిద్దరు సినిమాకు వెళ్లడం, కుమార్తె వరండాలో పడుకోవడంతో బెడ్‌రూమ్‌లో భార్యభర్తలిద్దరు ఎకాంతంగా ఉన్న సమయంలో జనరేటర్ నుండి వచ్చిన దట్టమైన పొగలు పట్టించుకోకపోవడంతో వీరిద్దరు ఊపిరాడక మృతి చెంది ఉండవచ్చని సిఐ తిరుమలరావు తెలిపారు.

తల్లిదండ్రులిద్దరు ఈ విధంగా మృత్యువాతకు గురికావడంతో పిల్లలు ముగ్గురు అనాధలుగా మారిపోవడం స్థానికులను కలిచి వేసింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కెజిహెచ్ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

శారదానదిలో విద్యార్థి గల్లంతు

సరదాగా స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లిన ఓ యువకుడు శారదా నదిలో గల్లంతయ్యాడు. వివరాల్లోకి వెళితే..
తుపాను కారణంగా కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్థులు దేవరాపల్లిలోని బాతువా బ్రిడ్జి వద్ద శారదానదిలో స్నానానికి వెళ్ళారు. వీరంతా ఎస్.కోటలో ఉన్న పుణ్యగిరి కాలేజీలో ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్నారు.

శారదానదిలో స్నానానికి వెళ్ళి ఈత కొడుతుండగా కొంతసేపటికి ప్రవాహ వేగంలో గొర్లి సునీల్(21) అనే విద్యార్థి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. ఈ విషయం గమనించి మిగిలిన ముగ్గురు అతికష్టం మీద ఒడ్డుకు చేరుకుని స్నేహితుడు సునీల్ కోసం గాలించారు. నది ఒడ్డున గాలించి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు, గ్రామస్థులకు తెలియజేశారు. గల్లంతైన సునీల్ ఆచూకీ బుధవారం సాయంత్రం వరకు తెలియరాలేదు. సునీల్ నిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+