కాలేజీలో సీనియర్స్ జూనియర్స్ మధ్య గొడవ...గుండు కొట్టించిన యాజమాన్యం...
ఈ మధ్యకాలంలో స్కూళ్లలో, కళాశాలల్లో విద్యార్థులు చిన్న చిన్నవిషయాలకే కొట్టుకోవడం సాధారణమైపోయింది. ఆ గొడవలు కాస్త పెద్దవయ్యి ఒకరినొకరు చంపుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే, ఇక్కడ మాత్రం ఓ కళాశాల యాజమాన్యం క్రమశిక్షణ తప్పింది. ఓ కళాశాలలో ఇంటర్ ఫస్టఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త చిలికి చిలికి చివరికి పెద్ద ఘర్షణకు దారితీసింది.
కొట్టుకోవడం, గొడవపడ్డం తప్పని మందలించాల్సిన యజమాన్యమే విద్యార్థులను దారుణంగా చితకబాదింది. అయితే, కళాశాల యాజమాన్యం వారికి ఎన్నిసార్లు నచ్చజెప్పినా వారు అదే పద్ధతిని కొనసాగిస్తున్నారనే కోపంతో వారు విద్యార్థులను దారుణంగా కొట్టినట్లు తెలుస్తోంది. ఇంకా గొడవపడిన ఆరుగురు విద్యార్థులకు కళాశాల యాజమాన్యం ఏకంగా గుండు చేయించారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

ఆసుపత్రి పాలయిన విద్యార్థులు : సోమవారం రాత్రి ఎపిలోని నంద్యాల జిల్లాలోని ఓ ప్రయివేట్ కాలేజీలో సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. ఆ గొడవలో ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకున్నారు. ఈ విషయం కాస్త కళాశాల యాజమాన్యానికి తెలిసింది. దాంతో గొడవ పడిన వారిని మందలించాల్సిన గురువులే క్రమశిక్షణ తప్పారు. విద్యార్థులు చేసిన పనినే కళాశాల యాజమాన్యం కూడా చేసింది. గొడవపడిన వారిని కళాశాల యాజమాన్యం దారుణంగా కొట్టింది. అందులో చాలామంది విద్యార్థులు గాయాలపాలయ్యారు.
ఆ దాడిలో ఒక విద్యార్థి తన చేతిని కూడా కోల్పోవలసి వచ్చింది. ప్రస్తుతం ఆ విద్యార్థి హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అంతటితో ఆగని ళాశాల యాజమాన్యం ఆ గొడవపడిన విద్యార్థులలోని ఆరుగురికి గుండు చెయించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యం చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు గొడవపడితే వారిని మందిలించాల్సింది పోయి, వారిపై దాడికి దిగి గాయాలపాలు చేయడం ఏంటి అని కొందరు కళాశాల యాజమాన్యం వైఖరిపై విరుచుకపడుతున్నారు. ఈ సంఘటన స్థానికంగా చర్చకు దారితీసింది.












Click it and Unblock the Notifications