తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమలలో అపచారం: ప్రధాన ఆలయంపై చక్కర్లు కొట్టిన విమానం

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరోసారి అపచారం చోటు చేసుకుంది. శ్రీవారి ప్రధాన ఆలయంపైగా ఒక విమానం చక్కర్లు కొట్టింది. దీంతో తిరుమలలో నిఘా వైఫల్యం మరోసారి బయటపఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆలయంపై విమానాలు తిరగటం ఆగమవిరుద్ధమని అర్చకులు పలుమార్లు సూచించినా అదే ధోరణి కొనసాగుతోంది. శ్రీవారి ఆలయ ప్రాంతాన్ని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది.

A flight circled on tirumala temple surrounds

20నుంచి శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు మే 20 నుంచి 22వ తేదీ వరకు జరగనున్నాయి. 19వ తేదీ అంకురార్పణతో వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 21వ తేదీన ఉదయం స్వర్ణ రథోత్సవం జరగనుంది.

ఈ సందర్భంగా మూడు రోజుల పాటు సాయంత్రం 3 నుంచి 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాఢ వీధుల్లో అమ్మవారి ఉత్సవం జరగుతుంది.

వసంతోత్సవం సందర్భంగా ఆలయంలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, వూంజల సేవను రద్దు చేయనున్నారు. వసంతోత్సవాలు పురస్కరించుకుని మే 17వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. భక్తులు ఒక్కొక్కరు రూ.150 చెల్లించి ఒకరోజు వసంతోత్సవంలో పాల్గొనవచ్చు.

English summary
It said taht a flight circled on tirumala temple surrounds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X