భర్త ఉండగానే కోరిక తీర్చమంటూ మాజీ కార్పొరేటర్ వేధింపులు

Subscribe to Oneindia Telugu

పశ్చిమగోదావరి: కీచకుడిలా మారిన ఓ మాజీ కార్పొరేటర్ ఉదంతమిది. తన కోరిక తీర్చాలంటూ ఓ మాజీ కార్పొరేటర్‌ ఓ వివాహితను వేధింపులకు గురిచేస్తున్నాడు. అతని వేధింపులు భరించలేక బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి పిర్యాదు మేరకు నిందితుడు, అతనికి సహకరించిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఏలూరు వన్‌టౌన్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు తూర్పువీధికి చెందిన ఓ వివాహిత(33)కు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల ఆమె భర్త అన్డెఫ్‌నేటెడ్‌ స్ర్కిజోఫినియా (చిన్న పిల్లల మనస్తత్వంతో ప్రవర్తించడం) వ్యాధికి గురయ్యాడు. కాగా, ఇదే అదునుగా చేసుకుని ఆ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ కౌలూరి చంద్రశేఖర్‌.. సదరు వివాహిత మరిది కృష్ణమోహన్‌తో పరిచయం పెంచుకుని తరచుగా వారి ఇంటికి వస్తూ తన కోరికను తీర్చమంటూ ఆమెను వేధిస్తున్నాడు.

A former corporator allegedly harassed a woman

అంతేగాక, గత ఫిబ్రవరి 19వ తేదీ నుంచి తరచుగా ఆమె సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు పెడుతున్నాడు. అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతూ తన కోరిక తీర్చాలంటూ బెదిరింపు మెసేజ్‌లు కూడా పెట్టాడు. కాగా, వట్లూరునకు చెందిన వేగుంట ధన కోటేశ్వరరావు, అతని కుమారుడు సురేష్‌లు కూడా ఆమెను వేధిస్తూ చంద్రశేఖర్‌కు సహకరించారు.

జులై 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు మాజీ కార్పొరేటర్‌ కౌలూరి చంద్రశేఖర్‌, ఆమె మరిది కృష్ణమోహన్‌ ఆమె ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి అత్యాచారయత్నంకు పాల్పడ్డారు.

ఈ ఘటనపై బాధితురాలు ఆదివారం ఏలూరు నగర సీఐ రాజశేఖర్‌కు ఫిర్యాదు చేయడంతో సీఐ ఆదేశాల మేరకు వన్‌టౌన్‌ ఎస్‌ఐ కె రామారావు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కౌలూరి చంద్రశేఖర్‌, రెండవ నిందితుడిగా కృష్ణమోహన్‌, వేగుంట ధన కోటేశ్వరరావు, వేగుంట సురేష్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A former corporator allegedly harassed a woman in West Godavari district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X