టీవీ చూసేందుకు వస్తే విద్యార్థినిపై అత్యాచారం చేశాడు: చంపేస్తానని బెదిరింపు

గుంటూరు: టీవీ చూడటానికి తన ఇంటికి వచ్చిన 11ఏళ్ల బాలికపై వివాహితుడైన ఓ వ్యక్తి బెదిరింపులకు గురిచేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన జిల్లాలోని ఈపూరు మండలం కొండ్రముట్లలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు పోలియోకు గురైన వికలాంగుడు.

బాధితురాలి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. ఆరో తరగతి చదువుతున్న ఆ బాలిక కామెర్ల వ్యాధితో బాధపడుతోంది. ఇటీవలే వ్యాధికి చికిత్స చేయించారు తల్లిదండ్రులు. కాగా, మూడురోజుల క్రితం బాలికను ఇంటి వద్దనే వదిలి పనులకు వెళ్లారు.

అయితే, ఆ బాలిక టీవీ చూడటానికి సమీపంలోని తెలిసినవారి ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న వికలాంగడైన వివాహితుడు ముట్లూరి చినబంగారయ్య పథకం ప్రకారం శబ్దం బయటకు వినపడకుండా టీవీ సౌండ్ పెంచాడు.

A girl allegedly raped in Guntur district

అనంతరం ఆమెను భయపెట్టి అత్యాచానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే చంస్తానని బెదిరింపులకు గురిచేశాడు. అంతేగాక, 'మీ అమ్మకు ఈ విషయం తెలిస్తే నిన్ను చంపుతుంది. కాబట్టి ఎవరికీ చెప్పొద్దు' అంటూ భయపెట్టాడు. దీంతో ఆమె భయంతో విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచింది. మూడు రోజులుగా బాలిక అనారోగ్యంగా కనిపించడంతో ఆందోళన చెందిన ఆమె తల్లి సోమవారం సాయంత్రం వినుకొండలోని ఆస్పత్రికి తీసుకుని వెళ్లింది.

పరీక్షించిన వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందంటూ అనుమానం వ్యక్తం చేశారు. దీంతో బాలికను ప్రశ్నించగా జరిగిన ఘోరాన్ని తెలిపింది. ఆందోళన చెందిన తల్లి మంగళవారం ఈపూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. ఎస్‌ఐ ఉజ్వల్‌కుమార్‌ మాట్లాడుతూ.. మైనరు బాలికపై అత్యాచారం సంఘటనపై కేసు నమోదు చేశామని నిందితుణ్ని త్వరలో అరెస్ట్‌ చేస్తామనీ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+