లారీ ఢీ: పుట్టిన రోజే చిన్నారి నీరజ మృతి, తండ్రికి తీవ్రగాయాలు
పశ్చిమగోదావరి: జిల్లాలోని దేవరపల్లి శివారులో ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి చెందింది. ఆమె తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దేవరపల్లి మండలం బందపురంలో విద్యుత్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న ఆదిశేఖర్ తన కుమార్తె నీరజ(14)ను ద్విచక్ర వాహనంపై పాఠశాలకు తీసుకెళ్తుండగా.. లారీ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో నీరజ అక్కడికక్కడే మృతి చెందగా, ఆదిశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆదిశేఖర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగా, ఈ రోజే నీరజ పుట్టినరోజు కూడా కావడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవరపల్లి పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications