టీవీ రిమోట్ కోసం గొడవపడి ఆత్మహత్య చేసుకుంది

A Girl commit suicide for TV remote in Hyderabad
హైదరాబాద్: నగరంలోని బోరబండలో విషాధం నెలకొంది. తనకు టీవీ రిమోట్ ఇవ్వలేదని అక్కతో గొడవపడిన ఓ బాలిక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. రాజీవ్‌నగర్‌కు చెందిన ఖాదర్ ఖాన్ కుమార్తులిద్దరూ తరచూ టీవీ రిమోట్ కోసం గొడవపడుతూ ఉండేవారు. ఆదివారం కూడా టీవీ విషయంలో వివాదం జరిగింది.

తనకు ఇష్టమైన ఛానల్ చూడనివ్వడం లేదని చెల్లెలు మరియా ఫాతిమా (13) అక్కతో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. అక్క రిమోట్ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన ఫాతిమా గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుంది.

కొన ఊపిరితో ఉందని గమనించిన కుటుంబ సభ్యులు, వెంటనే ఆమెను అమీర్‌పేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఫాతిమా మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు.

అక్కా, చెల్లెళ్ల మధ్య టీవీ విషయంలో గతంలో కూడా పలుమార్లు ఇలాంటి వివాదాలు జరిగాయని, ఇంతదూరం వస్తుందని తాము అనుకోలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+