ఇష్టం లేని పెళ్లి: ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతి, ఐదు రోజులైనా..
విజయవాడ: తనకు ఇష్టం లేని వివాహం చేసేందుకు కుటుంబసభ్యులు సిద్ధం కావడంతో ఓ యువతి ఇంటి నుంచి అదృశ్యమైంది. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన వ్యాపారి కసర్ విజయవాడలోని సింగ్‌నగర్‌లో నివాసముంటున్నారు.
తన కుమార్తె కిరణ్ కౌర్(24) గత ఐదు రోజులుగా కనిపించడం లేదంటూ సోమవారం కసర్ సింగ్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నత విద్యావంతురాలైన తమ కుమార్తెకు ఇటీవల వివాహం చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఈ వివాహం ఇష్టంలేకపోవడం ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఫిర్యాదులో తెలిపారు.

ఐదు రోజులైనా తమ కూతురు ఇంటికి రాకపోవడంతో తీవ్ర ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేశామని కసర్ సింగ్ చెప్పారు. ఈ మేరకు యువతి అదృశ్యం కేసు నమోదు చేసుకున్నామని, ఆమె కోసం గాలింపు చేపట్టినట్లు సింగ్ నగర్ సీఐ జగన్మోహన్ రావు తెలిపారు.
ఇప్పటికే ఆ యువతి స్నేహితులని ఆరా తీశామని, ఆమెకు ప్రేమ వ్యవహారాలు ఏమీ లేవని తెలిసిందని చెప్పారు. కేవలం పెళ్లి ఇష్టం లేకనే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందని.. తన స్నేహితులు లేదా ప్రైవేటు హాస్టల్‌లో ఆమె ఉండిఉండవచ్చనే కోణంలో గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications