వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు..చిత్తూరు జిల్లాలో కలకలం; ఉలిక్కిపడ్డ జనం!!

|
Google Oneindia TeluguNews

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు కలకలం సృష్టించింది. పోలీస్ స్టేషన్ ఆవరణలో వెనకవైపు ఉన్న భవనంలో తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పోలీస్ స్టేషన్ భవనంలోని కిటికీలు, తలుపులు అద్దాలు, ధ్వంసమయ్యాయి. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఇక సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పేలుడు ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు.

పోలీస్ స్టేషన్ లో పేలుడుతో డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసులకు గాయాలు

పోలీస్ స్టేషన్ లో పేలుడుతో డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసులకు గాయాలు

పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన పేలుడుతో డ్యూటీలో ఉన్న ఏఎస్ఐ ఆంజనేయులు రెడ్డి, కానిస్టేబుల్ గజేంద్ర కు స్వల్పగాయాలయ్యాయి. కిటికీల అద్దాలు పగిలి వారికి గుచ్చుకున్నాయి. దీంతో వారికి గాయాలయ్యాయి . ఇక పేలుడు శబ్దం విన్న చుట్టుపక్కల వారు ఒకసారి భయభ్రాంతులకు గురయ్యారు. రాత్రి మూడు గంటల సమయంలో భారీ పేలుడు సంభవించడంతో ఉలిక్కిపడి లేచిన జనాలు అది పోలీస్ స్టేషన్ లో జరిగిన పేలుడు అని తెలిసి మరింత ఆందోళనకు గురయ్యారు.

భారీ నష్టం జరగలేదని ఊపిరి పీల్చుకున్న పోలీసులు


అయితే ఈ పేలుడు ఉదయం జరిగి ఉంటే భారీ నష్టం జరిగి ఉండేదని, రాత్రి నైట్ డ్యూటీ లో ఇద్దరే ఉండటంవల్ల, వారికి స్వల్ప గాయాలు కావడం వల్ల పెద్ద నష్టం జరగలేదని పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఏదైనా నాటు బాంబు పేలిందా అన్న అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. క్వారీలలో ఉపయోగించి జిలెటిన్ స్టిక్స్ పేలాయా? లేక 2018 జూన్ లో గంగాధరనెల్లూరు పోలీసులు 713 కిలోల నల్ల మందు ను సీజ్ చేశారు. దానిని అప్పుడే నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నిర్వీర్యం చేశారు.

పోలీస్ స్టేషన్ లో ఉంచి నల్లమందు వల్లే పేలుడు

పోలీస్ స్టేషన్ లో ఉంచి నల్లమందు వల్లే పేలుడు


అయితే ఎఫ్ఎస్ఎల్ పరీక్షల కోసం దాదాపు 2 కిలోల నల్ల మందు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఓ చెట్టు క్రింద సేఫ్ గా దాచి ఉంచారు. ఇక పోలీసులు పోలీస్ స్టేషన్ దగ్గర ఉంచిన నల్లమందు పేలటం వల్లనే ప్రమాదం జరిగిందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు పేలుడుకు నల్లమందే కారణం అని తేల్చారు. మొత్తానికి ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ పేలుడు ఘటనపై పోలీసులకు అనేక అనుమానాలున్నాయి. దీంతో అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A huge explosion created tension at the Gangadhara Nellore police station in Chittoor district. In this blast, vehicles near the police station were destroyed, windows and doors were broken. Two policemen on duty sustained minor injuries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X