వాహ్:39 నిమిషాల వ్యవధిలో 3గురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ
ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది ఓ మాతృమూర్తి. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేట పట్టణంలోని శనివారం నాడు చోటుచేసుకొంది.
ఆశ్వరావుపేట:ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది ఓ మాతృమూర్తి. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేట పట్టణంలోని శనివారం నాడు చోటుచేసుకొంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా ధర్మగూడెనికి చెందిన సిద్దుల మంగ పురిటినొప్పులతో పట్టణంలోని వెన్నెల ఆసుపత్రిలో చేరింది.

డాక్టర్ ఉదయజ్యోతి ఆమెకు వైద్య చికిత్సలను అందించారు. శనివారం నాడు తెల్లవారుజామున మంగ 39 నిమిషాల్లో వరుసగా ముగ్గురు సంతానికి జన్మనిచ్చింది. ఒక ఆడపిల్ల, ఇద్దరు మగపిల్లలక జన్మించారు.
మొదటి బిడ్డ తెల్లవారుజామున 5.11 గంటలకు , రెండో బిడ్డ 5.23 గంటలకు, మూడో బిడ్డ 5.40 గంటలకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలందరూ క్షేమంగానే ఉన్నారని డాక్టర్ ఉదయజ్యోతి తెలిపారు. మంగకు ఇదే మొదటి కాన్పు. గతంలో రెండు సార్లు ఆమెకు గర్భస్రావమైంది.
ఒకే కాన్పులో ముగ్గురు సంతానం తగ్గడమే కాకుండా అందరూ ఆర్యోగంగా ఉండడమే సంతోషంగా ఉందని మంగ భర్త నాగేంద్ర చెప్పారు.అయితే రెండు దఫాలు గర్భస్రావమై మూడో దఫా తన భార్య ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం పట్ల నాగేంద్ర ఉబ్బితబ్బియ్యారు.












Click it and Unblock the Notifications