వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్ళై 15 రోజులకే భర్తతో విడిపోయి,మరోకరితో సహజీవనం, ఆ తర్వాతిలా..

పెళ్ళే రెండు మాసాలు దాటింది. కాని, భర్తతో 15 రోజులకే ఆమె విడిపోయింది. మరో వైపు ఓ తాపీ మేస్త్రీతో సహజీవనం చేస్తోంది.అయితే ఆమె నెల రోజుల తర్వాత అనుమానాస్పద స్థితిలో మరణించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి : పెళ్ళే రెండు మాసాలు దాటింది. కాని, భర్తతో 15 రోజులకే ఆమె విడిపోయింది. మరో వైపు ఓ తాపీ మేస్త్రీతో సహజీవనం చేస్తోంది.అయితే ఆమె నెల రోజుల తర్వాత అనుమానాస్పద స్థితిలో మరణించారు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి సమీపంలోని ధర్మకోట గ్రామానికి చెందిన మల్లాడి రాంబాబు, నాగలక్ష్మి దంపతుల కుమార్తె కృష్ణవేణి ని ప్రెంచి యానాంకు చెందిన సంగాని సత్యనారాయణకు 2016 డిసెంబర్ 1న, వివాహం చేశారు. అయితే 15 రోజుల పాటు కాపురం చేశారు. అయితే సత్యనారాయణ, కృష్ణవేణి ల మధ్య విబేధాలు తలెత్తాయి.

భర్త వేధింపులు తాళలేక కృష్ణవేణి అమలాపురానికి చేరుకొంది. స్థానికంగా తాపీ పనిచేస్తోన్న చుట్టుగుళ్ళ నానితో కృష్ణవేణికి పరిచయం ఏర్పడింది.

a lady died at her residence in east godavari

కామనగరువు శివారు అబ్బిరెడ్డివారి కాలనీలో భార్యభర్తలమని చెప్పి ఓ ఇంట్లో అద్దెకు దిగారు. తాపీ పనిచేసుకొనే నాని రెండు రోజులకు ఓసారి వస్తానని ఇంటివారిని నమ్మించి కృష్ణవేణిని చూసుకోబోమని చెప్పుండేవారు. కృష్ణవేణి స్థానిక ముస్లిం వీధిలోని గణేష్ కిరాణ మర్చంట్స్ లో పనిచేసేది.

దరిమిలా ఈ నెల 29వ, తేదిన ఉదయం కృష్ణవేణి స్పహలేకుండా పడి ఉంది. అయితే ధర్మకోటలో ఉంటున్న కృష్ణవేణి తల్లిదండ్రులకు, ఆమె సహజీవనం చేస్తోన్న నానికి ఇంటి యజమాని సమాచారం ఇచ్చాడు.

కృష్ణవేణిని స్థానిక కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమె అప్పటికే మరణించినట్టుగా వైద్యులు ధృవీకరించారు.కృష్ణవేణిని పరిశీలించిన వైద్యులు ఆమె మెడపై ఉరివేసినట్టుగా గుర్తులున్నాయి. అదే సమయంలో నాని ఇంట్లో ఉన్న సామాగ్రిని తరలించారు.

అయితే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా, లేక హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A lady died at her residence in east godavari,police registered case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X