పెళ్ళైన నెలరోజులకే ఆమె అలా...వరుడు దూరంగా...ఎందుకు
పెళ్ళైన నెల రోజులకే వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే అత్తింటివారే ఆమెను హత్య చేశారని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు
రాజంపేట:పెళ్ళైన నెల రోజులకే వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే అత్తింటివారే ఆమెను హత్య చేశారని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
కడప జిల్లా పెనగలూరు మండలంలోని వెలగచర్లకు చెందిన రామచంద్రయ్య కుటుంబం గత కొంతకాలంగా రాజంపేటలోని ఆకుల వీధిలో నివాసం ఉంటోంది. వారి రెండో కుమార్తె గౌతమికి మండలంలోని మందపల్లెకు చెందిన నాగభూమషణ కుమారుడు రమేష్ తో ఏడాది క్రితం వివాహమైంది
.

వివాహమైన నెలరోజులకే రమేష్ కువైట్ కు వెళ్ళాడు. కొంతకాలం నుండి వారింట్లో కుటుంబ తగాదాలున్నాయని అత్తింటివారు చెబుతున్నారు.అయితే తమ కూతురును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్టుగా మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
బుదవారం నాడు శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రి వద్ద మృతదేహన్ని తెచ్చిన సందర్భంగా మృతురాలి కుటుంభీకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. తమ కూతురిని అత్తింటివారే హత్య చేశారని మృతురాలి కుటుంబసభ్యులు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భార్య మరణవార్త తెలుసుకొని కువైట్ నుండి రమేష్ వచ్చాడు. రమేష్ తో పాటు ఆయన తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications