అమెరికాలో కృష్ణా జిల్లా వాసి దారుణ హత్య
న్యూయార్క్/విజయవాడ: కృష్ణా జిల్లాకు చెందిన పరుచూరి బాలగోపాల్ అనే వ్యక్తి అమెరికాలో హత్యకు గురయ్యాడు. మృతుడు చల్లపల్లి మండలం చిట్టూర్పుకు చెందిన బాలగోపాల్ అమెరికాలోనిలోని సౌత్ కరోలినా రాష్ట్రంలోని మైథేల్ బీచ్‌లో గ్యాస్‌స్టేషన్ నడుపుతున్నాడు.
దొంగతనం కోసం గ్యాస్ స్టేషన్‌లోకి ప్రవేశించిన నల్లజాతీయుడు బాలగోపాల్‌ను కాల్చి చంపాడు. బాలగోపాల్ స్నేహితుల ద్వారా సమాచారం తెలుసుకున్న మృతుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాలగోపాల్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకు రావాలని అతని స్నేహితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
అనంతపురంలో విషాదం

అనంతపురం జిల్లాలోని బొమ్మాల్‌హళ్‌లో విషాదం చోటు చేసుకుంది. బొమ్మాల్‌హళ్‌లోని హెచ్‌ఎల్‌సీ కాలువలోకి దూకి తల్లీకూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇరువురూ మృతి చెందారు. తల్లి మృతదేహం ఇప్పటికే లభించగా, కుమార్తె మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కోటప్పకొండ ఆలయంలో చోరీ
గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. 60 కేజీల ఇత్తడి వస్తువులు చోరీ అయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి ఆలయ ఉద్యోగి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications