శీతలపానీయంలో కొడుకులకు విషమిచ్చి చంపిన తండ్రి
ప్రకాశం: జిల్లాలోని తాళ్లూరు మండలం విఠలాపురంలో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. తన కుమారులచేత పురుగుల మందు తాగించి చంపేశాడు ఓ తండ్రి. అనంతరం తానూ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. విఠలాపురం గ్రామానికి చెందిన కైపు వెంకటరెడ్డి కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం అతను తన ఇద్దరు కుమారులను పొలానికి తీసుకెళ్లి శీతలపానియంలో పురుగుల మందు కలిపి ఇచ్చాడు.

ఆ శీతలపానియాన్ని తాగిన పిల్లలు ఇంద్రసేనారెడ్డి(7), యశ్వంత్ రెడ్డి(5) అక్కడికక్కడే మృతి చెందారు. వారి మృతదేహాలను చెట్టు కిందకు చేర్చిన వెంకటరెడ్డి అనంతరం పురుగులమందు తాగాడు. గమనించిన స్థానికులు వెంకటరెడ్డిని ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. వెంకటరెడ్డి మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications