మద్యం మత్తులో ఘర్షణ: తల్లిని తుపాకీతో కాల్చి చంపేశాడు

గుంటూరు: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్నతల్లినే తుపాకీతో కాల్చి చంపాడో దుర్మార్గుడు. ఈ ఘటన జిల్లాలోని కాకుమాను మండలం కొమ్మూరులో బుధవారం ఉదయం జరిగింది.

ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కొమ్మూరు గ్రామానికి చెందిన మస్తాన్‌వలి (47) ఆర్మీలో పని చేసి రిటైరయ్యాడు. ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుంచీ మద్యానికి బానిస అయి తరచూ తల్లి ఫజ్లూం(65)తో ఘర్షణ పడేవాడు.

ఈ క్రమంలోనే బుధవారం కూడా తల్లితో ఘర్షణ పడ్డాడు మస్తాన్‌వలి. మద్యం మత్తులో ఉన్న మస్తాన్‌వలి తన లెసైన్స్‌డ్ రివాల్వర్‌తో తల్లిని కాల్చి చంపాడు. అనంతరం అతడు పరారైయ్యాడు.

A man allegedly murdered his mother

గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని తల్లి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నన్నట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం అంకులపాటూరు ఎస్‌బీక్యూ ఉప్పు పరిశ్రమ ఎదుట బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఊరెళ్లటానికి లారీ ఎక్కుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మృతుడు చెన్నైలోని అన్నానగర్‌కు చెందిన బాలమురుగన్(40) గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+