పెళ్లైన కొత్తలోనే.. స్నేహితులతో కలిసి భార్య హత్య, తప్పిపోయిందని ఫిర్యాదు
అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లై ఐదు నెలలు గడవక ముందే ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను స్నేహితులతో కలిసి దారుణంగా హత్య చేశాడు.
అనంతపురం: జిల్లాలోని వజ్రకరూర్ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లై ఐదు నెలలు గడవక ముందే ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను స్నేహితులతో కలిసి దారుణంగా హత్య చేశాడు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. ఎన్‌ఎన్‌పి తండాకు చెందిన హరినాయక్‌కు, అదే గ్రామానికి చెందిన అంజలీబాయ్‌కు ఐదు నెలల క్రితం వివాహమైంది. కొద్దిరోజులుగా భార్యభర్తల మధ్య ఓ విషయంపై చిన్నపాటి గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది.

ఈ క్రమంలో జులై 13న తన భార్య కనిపించడం లేదంటూ హరి నాయక్ వజ్రకరూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, దర్యాప్తులో వారికి విస్తుగొలిపే వాస్తవాలు తెలిశాయి.
అంజలీబాయ్‌ను హరినాయక్ తన స్నేహితులు అనిల్ నాయక్, గణేష్ నాయక్‌తో కలిసి దారుణంగా హత్య చేసి శింగనమల చెరువు వద్ద పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మృతురాలి బంధువులు గురువారం పోలీస్‌స్టేషన్ బయట ఆందోళన చేపట్టారు.












Click it and Unblock the Notifications