నకిలీ గోల్డ్ తో బ్యాంకుకు కోట్ల రూపాయల టోకరా .. సిబ్బంది పాత్ర కూడా ..

తమ తెలివితేటలతో బ్యాంకులనే మోసం చేశారు కొందరు ప్రబుద్ధులు. బ్యాంకులో బంగారాన్ని కొలతలు వేసే అప్రైజర్, మరి కొంత మంది వ్యక్తులు కలిసి బ్యాంక్ కే టోకరా వేయాలని ప్రయత్నం చేసి అడ్డంగా దొరికారు.

రంగారెడ్డి జిల్లాలో నకిలీ గోల్డ్ ను బ్యాంకు లో పెట్టి ఓ వ్యక్తి భారీగా లోన్ తీసుకున్నాడు. ఇక ఆ ప్రబుద్ధుడికి బ్యాంకు సిబ్బంది సహకారం అందించారు .

మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ లోని జరిగిన ఈ ఘటనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్యాంకు సిబ్బంది పాత్ర బయటకు వచ్చింది.
ఓ వ్యక్తి తన పేరు మీద కాకుండా తన పరిచయస్తుల పేరుమీద నకిలీ గోల్డ్ బ్యాంకు లో పెట్టి కోట్ల రూపాయల రుణాలు తీసుకుంటున్నాడు. ఇప్పటివరకు రెండున్నర కోట్ల రూపాయలను బ్యాంకు నుండి రుణంగా పొందాడు. రుణాలు చెల్లించకపోవడంతో ఈ మోసాలు బయటకు వచ్చాయి. బ్యాంకు అధికారులు బంగారాన్ని వేలం వెయ్యటానికి ప్రయత్నించిన క్రమంలో అది నకిలీ బంగారం అని తెలిసింది .

 a man and bank employees fraud with fake golad loans

గత నాలుగు సంవత్సరాలుగా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించిన బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.మోసానికి పాల్పడిన వ్యక్తి తో పాటు అతనికి సహకరించిన బ్యాంకు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ గోల్డ్ మోసం నేపధ్యంలో బ్యాంకు లో ఉన్న మిగతా సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు
.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+