ఏపీలో ఘోరం: బైక్‌పై తల్లి మృతదేహం: 108కు రిపేర్లు
Chandrababu Pawan Kalyan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు- పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత పరిస్థితులు తలకిందులు అయ్యాయి. ఈ నెలన్నర రోజుల వ్యవధిలోనే ఆరోగ్య వ్యవస్థ అస్తవ్యస్తమైందనడానికి తాజా ఉదాహరణ ఈ ఘటన.
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక అంబులెన్స్‌లు ఇప్పుడు అందుబాటులో ఉండట్లేదు. రిపేర్లు వచ్చాయనే కారణంతో అవి మూలకు పడ్డాయి. వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో కొనుగోలు చేసిన అంబులెన్స్‌లు.. ప్రభుత్వం మారగానే ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి.

కిందటి నెలలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత కింగ్ జార్జ్ ఆసుపత్రిలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పట్టిందా ఘటన. ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది విధి నిర్వహణలో ఎంత అలసత్వాన్ని ప్రదర్శిస్తోన్నారనే విషయాన్ని ఈ ఘటన తెర మీదికి తీసుకొచ్చింది అప్పట్లో.
నెలలు నిండకుండా పుట్టడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న ఓ పసిగుడ్డును మెటర్నిటీ వార్డు నుంచి నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించడానికి ఓ తండ్రి పడ్డ ఆవేదన కలచి వేసింది. నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించడానికి సిబ్బంది ఎవరూ సహకరించకపోవడంతో ఆక్సిజన్ సిలిండర్‌ను భుజాన మోసుకుని తీసుకెళ్లారు.
ఇప్పుడు అలాంటి ఉదంతమే అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. మరమ్మతుల వల్ల అంబులెన్స్ అందుబాటులో రాకపోవడంతో తల్లి మృతదేహాన్ని బైక్‌పై తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది. జిల్లాలోని రాజవొమ్మంగి మండలానికి చెందిన అన్నపూర్ణ అనే వృద్ధురాలు అనారోగ్యంతో జడ్డంగిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరణించింది.
ఆ సమయంలో కుటుంబ సభ్యులెవరూ ఆమె వెంట లేరు. మృతదేహాన్ని ఆమె ఇంటికి తరలించడానికి అంబులెన్స్ కోసం ప్రయత్నించగా.. ఎంత సేపటికి రాలేదు. రిపేర్లు రావడం వల్ల కొద్దిరోజులుగా అంబులెన్స్ మూలనపడినట్లు తేలింది. దీనితో మల్లికార్జున్ అనే వ్యక్తి మృతదేహాన్ని అయిదు కిలోమీటర్ల దూరం పాటు బైక్‌పై తీసుకెళ్లారు.












Click it and Unblock the Notifications