Kurnool: కర్నూలులో వ్యక్తి దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణమా..!
కర్నూలులోని భాస్కరాపురం వద్ద దారుణం జరిగింది. వంతెన వద్ద ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పగిడ్యాల మండలం కిందిప్రాతకోటకు చెందిన రాము కిషోర్ అలియాస్ వెంకటన్న కు భార్య మాధవి, 9 ఏళ్ల కొడుకు శరత్ చంద్ర ఉన్నారు.
రాము అదే గ్రామంలోని లక్ష్మన్న మెడికల్ షాపులో పని చేస్తున్నాడు. మధ్యాహ్నం నుంచి మెడికల్ షాపులో పని చేసే అతను ఉదయం.. ఇంటి వద్ద మెడికల్ షాప్ నిర్వహిస్తు ఉండేవాడు. భార్య ఇంటి వద్ద చీరలు విక్రయిస్తూ ఉండేది. రాము సోమవారం రాత్రి తనకు పని ఉందని మెడికల్ షాప్ ఓనర్ లక్ష్మన్నకు చెప్పి బయటకు వచ్చాడు. రాము నేరుగా ఇంటికి చేరుకున్నాడు.

ఇంటికి చేరుకున్న అతను స్నానం చేసి రెడీ అయ్యాడు. తర్వాత భార్యను ఐదు చీరలను ప్యాక్ చేయాలన కోరాడు. ప్యాక్ లో నాలుగు చీరలే పట్టాయి. దీంతో ప్యాక్ లో నాలుగు చీరలు.. బైక్ ట్యాంక్ కవర్ లో ఒక చీరను పెట్టుకున్నాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో బయటకు బల్దేరాడు. కొద్ది సేపటి తర్వాత మాధవి అతనికి ఫోన్ చేసింది. అప్పుడురాము తాను మెడికల్ షాప్ లో ఉన్నట్లు చెప్పాడు.
ఆ తర్వాత ఫోన్ చేస్తే స్వీచ్ఛాప్ వచ్చింది. మాధవికి మంగళవారం ఉదయం పోలీసులు నుంచి ఫోన్ వచ్చింది. రాము చనిపోయినట్లు మాధవికి చెప్పారు. పోలీసులు మాధవిని ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఈ మధ్య రాము ఓ మహిళతో ఎక్కువగా ఫోన్ మాట్లాడుతున్నాడని మాధవి చెప్పింది. ఎవరు అడిగితే మందుల కోసం వచ్చిన వారని చెప్పేవాడని పేర్కొంది. దీంతో ఈ హత్యకు వివాహేతర సంబంధం కారణమనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఘటనా స్థలిని ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాస రావు పరిశీలించారు. రాము ఫోన్ కాల్ డేటా, సీసీ కెమెరాల ఫురటెజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. వంతెన వద్దకు రాగానే కొందరు రామును అడ్డగించి గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications