వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్త, ప్రియుడు ఇద్దరూ కావాలి: 'ఫేస్‌బుక్ ప్రేమ'.. సందిగ్ధంలో వివాహిత

'నేను 38 ఏళ్ల వయసున్న వివాహితను. నాకు పిల్లలు కూడా ఉన్నారు. ఫేస్ బుక్ లో ఏడాది క్రితం ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇప్పుడు నేను అతడితో ప్రేమలో పడ్డానని అనిపిస్తోంది. '

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. పొద్దున లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునేదాకా అందులోనే తలదూర్చి బతికేవాళ్లు చాలామంది ఉన్నారు. బంధాలు, స్నేహాలు, కోపాలు, తాపాలు అన్ని వాటిల్లోనే కానిచ్చేస్తున్నారు.

అయితే సోషల్ మీడియా బంధాలు కొన్నిసార్లు వ్యక్తులను ఎంతటి సందిగ్ధంలోకి నెట్టేస్తాయో తెలపడానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ. ఫేస్ బుక్ ద్వారా ఓ వ్యక్తికి దగ్గరైన ఒక వివాహిత ఇప్పుడతనితో ప్రేమలో మునిగిపోయింది. ఆ ప్రేమ మైకం నుంచి బయటపడలేక.. భర్తను విడిచిపెట్టలేక.. ఇద్దరూ కావాలని ఆమె చెబుతున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది.

ఈ సందిగ్ధం నుంచి బయటపడలేక తనకో మార్గం చూపించమంటూ ఓ సైకాలజిస్టుకు ఆమె లేఖ రాయడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

A married woman letter to a psychologist about her Facebook love

సదరు వివాహిత అభిప్రాయం ఆమె మాటల్లోనే:

'నేను 38 ఏళ్ల వయసున్న వివాహితను. నాకు పిల్లలు కూడా ఉన్నారు. ఫేస్ బుక్ లో ఏడాది క్రితం ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇప్పుడు నేను అతడితో ప్రేమలో పడ్డానని అనిపిస్తోంది. నాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్తతో ఎటువంటి సమస్యల్లేవు. అతను నన్ను ఎంతో ప్రేమగా, శ్రద్ధగా చూసుకుంటారు'.

'కానీ, ఫేస్ బుక్ లో నాకు పరిచయమైన వ్యక్తి మాత్రం నిజంగా ప్రత్యేకం. నా భర్త దగ్గర నేను ఎప్పుడూ అలా ఫీలవ్వలేదు. ఒక్కరోజు అతడు నాతో మాట్లాడకపోయినా నాకు పిచ్చెక్కినట్టు ఉంటుంది. మూడు నెలల క్రితం నేను అతడ్ని కేవలం ముద్దు పెట్టుకున్నాను. ఆ అనుభూతిని ఇప్పటికీ మర్చిపోలేకున్నాను. పెళ్లయిన 18 ఏళ్లలో నా భర్తతో నేను ఒక్కసారి కూడా ఇటువంటి అనుభవాన్ని చవిచూడలేదు'.

'నేను సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినదాన్ని. పెళ్లికి ముందు ఏ అబ్బాయితోనూ నేను సన్నిహితంగా మెలగలేదు. సంబంధాలు పెట్టుకోలేదు.కానీ ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తి నాలో కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. అతడితో చాట్ చేసిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటాను. కానీ, అదే సమయంలో నేను నా భర్తను కానీ, కటుంబాన్ని కానీ బాధపెట్టాలని అనుకోవడం లేదు. నా స్వార్థం కోసం భర్తను విడిచిపెట్టాలని అనుకోవడం లేదు. అదే సమయంలో ప్రియుడితో నా ఫీలింగ్స్ ను కూడా కంట్రోల్ చేసుకోలేను. నేను గందరగోళాన్ని ఎదుర్కొంటున్నా. నాకు దారి చూపండి'

ఇలా తన బాధనంతా వ్యక్తం చేస్తూ ఓ సైకాలజిస్టుకు సదరు వివాహిత లేఖ రాసింది. ఆ లేఖను చదివిన చాలామంది ఆమె తీరును ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తలపట్టుకున్నారు.

English summary
A married woman wrote a letter to psychologist about her facebook love. She was in love with a facebook friend, at the same time she wants her husband forever
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X