విలాసాల కోసం బైక్,ల్యాప్‌ట్యాప్ విక్రయం: ట్విస్టిచ్చిన లవర్, మెడికో ఆత్మహత్య

Posted By:
Subscribe to Oneindia Telugu

చిత్తూరు: ప్రియురాలు తనకు దూరమైందని భరించలేక చిత్తూరు జిల్లా కుప్పంలో వైభవ్‌దేవ్ అనే మెడికో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం వైభవ్‌దేవ్ ఆత్మహత్య చేసుకొన్నాడు. ప్రియురాలు తనకు దక్కదనే బాధతో వైభవ్‌దేవ్ ఆత్మహత్య చేసుకొన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వైభవ్‌దేవ్ రూమ్‌లో డిప్రెషన్‌కు వాడే మందులు లభ్యమయ్యాయి.

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన వైభవ్‌దేవ్ చిత్తూరు జిల్లా కుప్పంలోని పీఈసీ కాలేజీలో పీజీ కోర్సులో చేరాడు. మానసిక వైద్యుడు కావాలనే లక్ష్యంతో ఈ కాలేజీలో చేరాడు. అయితే ప్రేమ ముసుగులో వైభవ్‌దేవ్ కొట్టుకుపోయాడు.

చదవును నిర్లక్ష్యం చేశారు. మానసికంగా కృంగిపోయాడని అతడి రూమ్‌లో దొరికిన మందులను బట్టి అర్ధమౌతోందని పోలీసులు అనుమానిస్తున్నారు.తన ప్రియురాలు వేరొకరికి దగ్గర కావడంతో వైభవ్‌దేవ్ తట్టుకోలేకపోయాడంటున్నారు పోలీసులు.

ప్రేమ కోసం

ప్రేమ కోసం

చిత్తూరు జిల్లా కుప్పంలోని పీఈఎస్ కాలేజీ పీజీ చదవేందుకు చేరిన వైభవ్ దేవ్ ఓ అమ్మాయితో ప్రేమలో పడిన ఘటన ఆయన జీవితాన్ని మలుపుతిప్పిందని పోలీసులు అనుమానిస్తున్నారు.చదువు కంటే ప్రేమ పేరుతో అమ్మాయితో తిరిగేందుకు ఎక్కువగా శ్రద్ద పెట్టేవాడని గుర్తించారు. దీంతో చదువుపై శ్రద్ద తగ్గిపోయిందని తేలిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

విలాసాల కోసం

విలాసాల కోసం

ప్రేమించిన యువతిని సంతోషపెట్టేందుకు విలాసవంతమైన ఖర్చులు చేసేవాడు. దీంతో ప్రతి నెల తల్లిదండ్రులు పంపే డబ్బులు కూడ వైభవ్‌దేవ్‌కు సరిపోలేదు.దీంతో వైభవ్ దేవ్ తల్లిదండ్రులకు మరిన్ని డబ్బులు పంపాలని కోరాడు. అయితే తల్లిదండ్రులకు కొంత ఇబ్బందిగా మారిందంటున్నారు.

ల్యాప్‌ట్యాప్, బైక్ విక్రయం

ల్యాప్‌ట్యాప్, బైక్ విక్రయం

ల్యాప్‌ట్యాప్, బైక్ ను కూడ విలాసాల కోసమే వైభవ్‌దేవ్ విక్రయించాడని అంటున్నారు. విలాసాల ఖర్చు విపరీతంగా పెరగడం, తల్లిదండ్రుల నుండి వచ్చే డబ్బులు తగ్గిపోవడంతో అనివార్యంగా వీటిని వైభవ్ దేవ్ విక్రయించాడని సన్నిహితులు చెబుతున్నారు.

మరో యువకుడికి దగ్గరగా

మరో యువకుడికి దగ్గరగా

అయితే అదే సమయంలో మరో యువకుడితో తాను ప్రేమించిన యువతి సన్నిహితంగా తిరుగుతోందనే విషయం తెలుసుకొన్న వైభవ్‌దేవ్ తీవ్రంగా కలత చెందారు. దీంతో మానసికంగా కృంగిపోయాడు. తన రూమ్‌లో మానసికంగా కృంగిపోకుండా ఉండేందుకు ఉపయోగించే మందులను పోలీసులు గుర్తించారు.ఈ విషయాలను ఎవరీకి చెప్పుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A medico, Dr. Vaibhav has allegedly committed suicide by hanging himself from the ceiling at hostel room in Kuppam PES Medical College. The victim hailed from Chhattisgarh. It is suspected that love affair could be behind his suicide.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి