గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం: శిశువును కొరికిచంపిన ఎలుకలు, సిఎం దిగ్ర్భాంతి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

గుంటూరు: వైద్యచికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించిన ఆ పసికందుపై ఎలుక దాడి చేసింది. ఒకసారి కాదు.. పదేపదే ఆ చిన్నారి లేత శరీరాన్ని తీవ్రంగా గాయపరిచింది. దీంతో, పసివాడు బుధవారం మృతిచెందాడు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల(జీజీహెచ్‌)లో ఈ విషాద సంఘటన జరిగింది.

విజయవాడ కృష్ణలంకకు చెందిన చావలి లక్ష్మి, నాగ దంపతులకు ఆగస్టు 17న మగ బిడ్డ జన్మించాడు. శిశువుకు మరింత మెరుగైన చికిత్స కోసం పది రోజుల క్రితం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. అవయవలోపంతో పుట్టిన శిశువుకు వైద్యులు వెంటిలేటర్ ద్వారా చికిత్స ప్రారంభించారు. అయితే వెంటిలేటర్ రూమ్‌లో ఏసి పైపుల ద్వారా ఎలుకలు లోపలికి ప్రవేశించి పసికందును గాయపర్చాయి.

తల్లి లక్ష్మి, తండ్రి నాగ గుర్తించి పసికందును తీసుకువెళతామని ప్రాధేయపడ్డారు. ఎలుకల దాడిలో ఏర్పడిన గాయాల విషయం బయటకు పొక్కకూడదనే ఉద్దేశంతో పసికందుకు అదనపు చికిత్స అవసరమంటూ ప్రభుత్వాసుపత్రి వైద్యులు తల్లిదండ్రులకు నచ్చచెప్పారు.

ఇంత జరిగినప్పటికీ వైద్యులు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆదివారం మరోమారు ఎలుకలు శిశువుపై దాడికి ఎగబడ్డాయి. దీంతో చికిత్స పొందుతూ పసికందు బుధవారం మృత్యువాత పడ్డాడు.

అయితే ఎలుకల దాడి విషయమై కొంతమంది రోగులు విధుల్లో ఉన్న వైద్యుడు సిహెచ్ భాస్కరరావు, నర్సుల దృష్టికి తీసుకెళ్లినా వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు బంధువులు ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ప్రభుత్వాసుపత్రిలో ఆందోళన నిర్వహించారు. గురువారం కూడా బాధితులు, వారి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

ఆస్పత్రి ఇదే

ఆస్పత్రి ఇదే

వైద్యచికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించిన ఆ పసికందుపై ఎలుక దాడి చేసింది. ఒకసారి కాదు.. పదేపదే ఆ చిన్నారి లేత శరీరాన్ని తీవ్రంగా గాయపరిచింది. దీంతో, పసివాడు బుధవారం మృతిచెందాడు.

మృతి చెందిన శిశువు

మృతి చెందిన శిశువు

గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల(జీజీహెచ్‌)లో ఈ విషాద సంఘటన జరిగింది.

మృతి చెందిన శిశువు

మృతి చెందిన శిశువు

విజయవాడ కృష్ణలంకకు చెందిన చావలి లక్ష్మి, నాగ దంపతులకు ఆగస్టు 17న మగ బిడ్డ జన్మించాడు. శిశువుకు మరింత మెరుగైన చికిత్స కోసం పది రోజుల క్రితం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు.

విషాదంలో శిశువు తల్లి

విషాదంలో శిశువు తల్లి

అవయవలోపంతో పుట్టిన శిశువుకు వైద్యులు వెంటిలేటర్ ద్వారా చికిత్స ప్రారంభించారు. అయితే వెంటిలేటర్ రూమ్‌లో ఏసి పైపుల ద్వారా ఎలుకలు లోపలికి ప్రవేశించి పసికందును గాయపర్చాయి.

బాధ్యులపై వేటు: మూడు కమిటీలు

ఆర్‌ఎంవోపై వేటుప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో పసిబిడ్డ ఎలుకకు బలి అయిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన తక్షణమే ఆర్‌ఎంవో, మరో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్‌ వేటు వేయాలని ఆదేశించారు.

మొత్తం వ్యవహారంపై కార్యదర్శి స్థాయి అధికారితో విచారణ జరిపించి, 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. బాధిత కుటుంబానికి తక్షణమే రెండు లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించింది.

ఘటనపై స్పందించిన వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మూడు కమిటీలు వేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం రాత్రి మంత్రులు కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు, పి నారాయణ ఆస్పత్రికి విచ్చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శానిటరీ ఇంఛార్జ్, సిబ్బందిని ఈ దుర్ఘటనకు బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేశామన్నారు. ప్రాథమిక విచారణ ప్రకారం వైద్యునికి, నర్సులకు ఎటువంటి సంబంధం లేదని తెలిసిందని వెల్లడించారు.

English summary
A new born child died with attacking of rats in Government Hospital, in Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X