Crime News: ప్రకాశం జిల్లాలో విషాదం.. పెళ్లైన రెండు నెలలకే ముగిసిన నవ దంపతుల జీవితం..

కొత్తగా పెళ్లైయింది. ఆ జంట ఎన్నో ఆశలతో నూతన జీవితంలోకి అడుగుపెట్టారు. కానీ వారి దంపత్య జీవితం రెండు నెలలకే ముగిసిపోయింది. ఆ నవ దంపతులను రోడ్డు ప్రమాదం మింగేసింది. ఈ విషాదకర ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో జరిగింది. జిల్లాలోని రామకూరు గ్రామానికి చెందిన మిన్నికంటి సిద్దయ్య, పద్మావతికి కుమారుడు పవన్‌ కుమార్‌తో పాటు ఒక కుమార్తె ఉన్నారు. పవన్ కుమార్ ఇంజినీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.

రాత్రి 9 గంటల సమయంలో
అతను 2020 కరోనా నుంచి వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నాడు. ఈ క్రమంలో సిద్ధయ్య తన కుమారుడు పవన్ కు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. మొన్న ఆగస్టులో పవన్‌ కుమార్‌కి నరసరావుపేట దగ్గరలోని వడ్లమూడి గ్రామానికి చెందిన కళ్యాణితో పెళ్లి చేశారు. పవన్‌ కుమార్‌, కళ్యాణి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. వారు గత ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో దంపతులు ఇద్దరూ టూవీలర్‌పై బొల్లాపల్లి టోల్‌ ప్లాజా వద్ద ఉన్న హోటల్‌లో భోజనం చేశారు.

 A newly married couple died in a road accident in Prakasam district

యూటర్న్ తీసుకుంటుండగా
అక్కడి నుంచి ఇంటికి వచ్చే క్రమంలో బొల్లాపల్లి వద్ద యూటర్న్ తీసుకుంటుండగా వారి టూవీలర్ ను బస్సు ఢీకొట్టింది0. ఈ ప్రమాదంలో పవన్‌ కుమార్‌ అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్ర గాయాలైన కళ్యాణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. పెళ్లైన రెండు నెలలకే నవ దంపతులు మృతి చెందడంతో రామకూరులో విషాదం నెలకొంది. మృతదేహాలను పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ప్రమాదం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నరాు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+