శ్రీవారి మెట్లమార్గంలో చిరుత, కాలినడక నిలిపివేత: తలనీలాలతో 13కోట్ల ఆదాయం

శ్రీవారి మెట్ల ప్రాంతంలో చిరుతల సంచారంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. అలిపిరి నడక మార్గంలో 1300 మెట్టు వద్ద చిరుతలను చూసిన భక్తులు తితిదే అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు కాలినడక మార్గంలో భక్తులను నిలిపివేశారు.

A Panther is wandering at Srivari Metla Margam

తలనీలాలతో 13కోట్ల ఆదాయం

భక్తులు సమర్పించే తలనీలాల విక్రయం ద్వారా తితిదేకు 13 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. జులై నెలకు సంబందించి తితిదే నిర్వహించిన ఈ- వేలంలో మొత్తం 26వేల కిలోల కురులు అమ్ముడు పోగా... రూ.13.85 కోట్ల ఆదాయం వచ్చింది.

తిరుమలలోని కల్యాణకట్టల్లో భక్తులు సమర్పించే తలనీలాలను తితిదే ప్రతినెలా ఈ-వేలం ద్వారా విక్రయిస్తోంది.

మోస్తారుగా భక్తుల రద్దీ

తిరుమలలో శుక్రవారం ఉదయం భక్తుల రద్దీ మోస్తారుగా ఉంది. ఉచిత, రూ. 50, రూ. 100, రూ. 500 గదులు లభించక భక్తులు అవస్థలు పడుతున్నారు. ఉచిత దర్శనం కోసం వేచివుండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 20 కంపార్టుమెంట్లు నిండాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+