నడుస్తున్న రైలు నుండి ప్రయాణీకుడి తోసేసిన టీసీ. ఎందుకంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

తిరుపతి: విమానాల్లో నుండి ప్రయాణీకులను అమానుషంగా దించేస్తున్న ఘటనలను చూస్తున్నాం.అయితే అదే తరహాలో రైలులో నుండి ప్రయాణీకుడిని టిక్కెట్టు కలెక్టర్ బయటకు తోసేశాడు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గిరిప్రసాద్ కోమాలోకి వెళ్ళాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

తిరుపతి -కొల్హాపూర్ మధ్య నడిచే హరిప్రియ ఎక్స్ ప్రెస్ లో దారుణం చోటుచేసుకొంది. గిరిప్రసాద్ అనే ప్రయాణీకుడిని టిక్కెట్టు కలెక్టర్ రైలు నుండి బయటకు తోసేశాడు.

train

టిక్కెట్ల తనిఖీ సమయంలో టీసీకి గిరిప్రసాద్ కు మధ్య వాగ్వాదం జరిగింది. టీసీ ఆగ్రహాంతో ముద్దనూరు మండలం ఓబులాపురం వద్ద గిరిప్రసాద్ ను కదులుతున్న రైల్లోంచి కిందికి నెట్టివేశాడు.

దీంతో గిరిప్రసాద్ అతడు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. బాధితుడు ప్రస్తుతం తాడిపత్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A passenger thrown off from running train on sunday. Giriprasad travelling on Tirupati- kolhapur train.Ticket collector thrown off Giriprasad from running train.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి