ప్రియుడి ఘాతుకం: ప్రేయసి కారులోని నరికి చంపి శవంతో పోలీసు స్టేషన్‌కు...

అసలే వివాహేతర సంబంధం... ఆపై ప్రియుడికి అనుమానం.. ఆరుగురితో సంబంధాలు పెట్టుకున్నావంటూ ప్రేయసిని ప్రియుడు నరికి చంపాడు. అనంతపురం జిల్లా తనకల్లు మండలం మండ్లిపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

అనంతపురం: అసలే వివాహేతర సంబంధం... ఆపై ప్రియుడికి అనుమానం.. ఆరుగురితో సంబంధాలు పెట్టుకున్నావంటూ ప్రేయసిని ప్రియుడు నరికి చంపాడు. అనంతపురం జిల్లా తనకల్లు మండలం మండ్లిపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

తనను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఓ ప్రియుడు ప్రియురాలిని నరికి చంపేశాడు. ఎన్జీవో కాలనీ చెందిన మల్లేశ్వరి ఆమె ప్రియుడు వేట కొడవలి తో నరికి చంపాడు. వివాహేతర సంబంధం ఆ ప్రియురాలి నిండు ప్రాణాలను బలిగొన్నది.

మల్లీశ్వరి కి కొన్నేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. పెళ్లి అయిన మల్లీశ్వరి తనను దూరం గా ఉంచుతుందని అనుకున్న ప్రియుడు ఓ పక్కా ప్రణాళిక తో ప్రియరాలిని నమ్మించి తనతో కారులో తీసుకెళ్లాడు. తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వక పోవడంతో ఆమె ప్రియుడు ఆమె తో గొడవకు దిగాడు.

కారులోనే హతమార్చాడు....

కారులోనే హతమార్చాడు....

కారులో గొడవకు దిగి ఆగ్రహానికి గురైన ప్రియుడు తాము ప్రయాణిస్తున్న కారులోనే ప్రియురాలు మల్లీశ్వరిని వేటకొడవలితో నరికి హత్యచేసి దగ్గరలో ఉన్న తనకల్లు పోలీస్ స్టేషన్లో కారుతో సహా లొంగిపోయాడు. తనతోనే కాకుండా మరి కొంత మందితో కూడా ఆమె సంబంధం పెట్టుకుందని అతను గొడవకు దిగాడు.

అతనికి భార్యాపిల్లలు ఉన్నారు...

అతనికి భార్యాపిల్లలు ఉన్నారు...

కదిరి పట్టణానికి చెందిన అశోక్‌కు భార్య సుభాషిణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అశోక్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. అదే పట్టణంలోని ఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్న కుార్ బ్రిక్స్, టైల్స్ వర్క్ చేసేవాడు. కుమార్ అప్పుడప్పుడు సిమెంట్ ఇటుకలను, టైల్స్‌ను అశోక్‌కు చెందిన టాటా ఎస్ వాహనంలో తరలించేవాడు అలా వారిద్దరికి మధ్య పరిచయం ఏర్పడింది.

భార్యతో వివాహేతర సంబంధం...

భార్యతో వివాహేతర సంబంధం...

కుమార్ ఇంట్లో లేని సమయంలో అశోక్ వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో కుమార్ భార్య మల్లీశ్వరి (40)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న కుమార్ అశోక్‌తో గొడవ పడ్డాడు కొద్ది రోజులకు అశోక్ తిరుపతికి మకాం మరా్చాడు. అక్కడే కారు పెట్టుకుని బాడుగలకు తిప్పేవాడు. దూరంగా వెళ్లి కూడా మల్లీశ్వరితో సంబంధాన్ని అతను వదులుకోలేదు.

మంగళవారం ఇలా...

మంగళవారం ఇలా...

మంగళవారం తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌కు మల్లీశ్వరిని రప్పించుకున్నాడు. అక్కడి నుంచి తన కారు (ఎపి టీవీ 5788)లో ఆమెను కూర్చోబెట్టుకుని పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డు పక్కన కారు ఆపాడు. అక్కడ కారులోనే అతను మల్లీశ్వరితో గొడవ పడ్డాడు. ఆ గొడవలో తీవ్ర ఆగ్రహానికి గురై అతను మల్లీశ్వరిని హత్య చేశాడు.

ఇంకా ఆరుగురితో....

ఇంకా ఆరుగురితో....

నాతోనే కాదు, మరో ఆరుగురితో వివాహేతర సంబంధం పెెట్టుకున్నావు. వాటిని వదులుకో అని అశోక్ మల్లీశ్వరిని హెచ్చరించాడు. ఆమె అందుకు అంగీకరించలేదు. ఇద్దరి మధ్య తీవ్రంగా వాగ్వివాదం చెలరేగింది. ఆగ్రహంతో అతను మల్లీశ్వరి మెపై ఐదుసార్లు వేటకొడవలితో నరికాడు. ఆమె అక్కడికక్కడే మరణించింది.

ఆ తర్వాత స్టేషన్‌కు...

ఆ తర్వాత స్టేషన్‌కు...

మల్లీశ్వరిని చంపిన తర్వాత అశోక్ మృతదేహంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తానే ఆమెను చంపినట్లు అంగీకరించాడు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+