ఎస్వీయులో ఉరివేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
చిత్తూరు: జిల్లాలోని తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ పీజీ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎం.కాం రెండో సంవత్సరం చదువుతున్న వైష్ణవి హాస్టల్ గదిలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు, ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, వైష్ణవి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
రోడ్డు ప్రమాదం: ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

పశ్చిమగోదావరి: జిల్లాలోని పెదపాడు మండలం వట్లూరు పాలిటెక్నిక్ కళాశాల వద్ద బైకుపై బోల్తాపడి ఒక విద్యార్ధి అక్కడికక్కడే మృతిచెందాడు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరొక విద్యార్ధి ప్రాణాపాయ స్థితిలో ఆస్పపత్రిలో చికిత్స పొందుతున్నాడు. త్రీటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక పవర్‌పేటకు చెందిన వేముల మోహన్ గంగాధర్ (22) తన స్నేహితుడు కాసరనేని శ్రీరామ్‌తో కలిసి బుధవారం ద్విచక్ర వాహనంపై కళాశాలకు బయల్దేరారు.
వీరిద్దరూ ఏలూరు సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నారు. అత్యంత వేగంగా నడపడంతో అదుపుతప్పిన బైక్ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మోహన్ గంగాధర్ అక్కడికక్కడే మృతిచెందగా శ్రీరామ్ తీవ్ర గాయాలపాలై ఆశ్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications