కత్తులతో దాడి: నడిరోడ్డుపై రౌడీషీటర్ దారుణ హత్య
పశ్చిమగోదావరి: ఏలూరు నగరంలో గురువారం ఉదయం ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని కొత్తపేటకు చెందిన రౌడీషీటర్ కంచి పెదకృష్ణ(50) తన సహచరులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు.
అదే సమయంలో చింతచెట్టు సెంటర్లో ప్రత్యర్థులు అతనిపై కత్తులతో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన కృష్ణ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కాగా, కృష్ణ పలు హత్య కేసుల్లో నిందితుడు.
టుటౌన్ సీఐ బంగార్రాజు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, నిందితుల కోసం గాలిస్తున్నామని సీఐ తెలిపారు.

ప్రమాదంలో యువకుడు మృతి
రవాసరం-పెనుమంట్ర ఆర్‌అండ్‌బీ రహదారిలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. వీరవాసరం ఎస్సై నాళం శ్రీనివాసరావు చెప్పిన వివరాల ప్రకారం.. పెనుమంట్ర మండలం పొలమూరుకు చెందిన జిన్నా సూర్యభాస్కర్, అడ్డాల వెంకట సత్యనారాయణ, సీహెచ్. దుర్గాప్రసాద్ బుధవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై పొలమూరు నుంచి వీరవాసరం వస్తున్నారు.
పంజావేమవరం సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వారిని ఢీకొంది. అదే సమయంలో ద్విచక్ర వాహనం వెనుక వచ్చిన ట్రాక్టర్ సూర్యభాస్కర్‌ను ఈడ్చుకెళ్లడంతో అతడు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం భీమవరం ప్రైవేటు ఆస్పపత్రికి తరలించినట్లు ఎస్సై శ్రీనివాసరావు చెప్పారు.
కాగా, సూర్యభాస్కర్ (25) ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడని తెలిపారు. సూర్యభాస్కర్ మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications