జగన్ కు షాక్.. వైసీపీ కీలకనేత, మాజీమంత్రి శిద్దా రాఘవరావు రాజీనామా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి భారీ విజయం సాధించింది. ఊహించని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత టిడిపి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది . ఇక ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జంపింగ్ ల పర్వం కొనసాగుతుంది.
వైసీపీకి గుడ్ బై చెప్పిన సిద్దా రాఘవరావు
ఇక ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలను చేపట్టి పాలనను పరుగులు పట్టించే ప్రయత్నంలో ఉన్నారు. ఇదే సమయంలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీ నుండి పలువురు నేతలు టిడిపి వైపు చూస్తుండగా, వలసల పర్వం మొదలైంది. తాజాగా మాజీ మంత్రి ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే శిద్దా రాఘవరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.

వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన
వైసిపికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే శిద్దా రాఘవరావు తన వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపించారు. 2014లో చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన శిద్దా రాఘవరావు 2019లో ఒంగోలు టిడిపి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఒంగోలు వైసిపి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు.
ఈ దఫా ఎన్నికల్లో పోటీ చెయ్యని సిద్దా రాఘవరావు
2024 ఎన్నికల్లో దర్శ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని భావించినా ఆయనను జగన్ పట్టించుకోలేదు. శిద్దా రాఘవరావుకు తనకు పట్టున్న దర్శి నియోజకవర్గం నుండి కాకుండా ఉమ్మడి ప్రకాశం లోని అద్దంకి, ఒంగోలు, మార్కాపురం స్థానాలలో ఇటు నుంచి పోటీ చేయాలని చేసిన ప్రతిపాదనలను ఆయన తిరస్కరించారు. దీంతో ఆయన ఈ దఫా పోటీలో లేరు.
వైసీపీ ఓటమితో మౌనం వీడిన బుద్దా
తనకు దర్శి టికెట్ ఇవ్వకపోవటంతో శిద్దా రాఘవరావు మౌనంగా ఉండిపోయారు. అక్కడ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విజయం సాధించగా.. వైసీపీ ఘోర పరాజయం పాలైంది. దీంతో ఏపీలో వైసీపీ ఓటమి నేపధ్యంలో తాజాగా శిద్దా రాఘవరావు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అయితే తన భవిష్యత్తుకు సంబంధించి ఇప్పటివరకు శిద్దా రాఘవరావు ఎటువంటి ప్రకటన చేయలేదు.












Click it and Unblock the Notifications