Online Betting: ఆన్ లైన్ బెట్టింగ్ లో రూ.24 లక్షల పోగొట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే..!
కొంత మంది ఆన్ లైన్ లో క్రికెట్ బెట్టింగులు చేస్తుంటారు. మొదట్లో డబ్బులు వచ్చిన తర్వాత ఇదేదో బాగుందని అనుకుంటారు. కానీ ఆ తర్వాత తెలుస్తుంది. అస్సలు కథ.. బెట్టింగ్ బానిసగా మారిపోతారు. ఇలా డబ్బులు పోగొట్టుకోవడమే కాదు.. అప్పుల పాలు అవుతారు. చివరికి ప్రాణాలు కోల్పోతారు. తాజాగా ఓ వ్యక్తి ఆన్‌లైన్ బెట్టింగ్‌లో దాదాపు రూ.24 లక్షలు నష్టపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతో కాదు.. ఎవరూ కూడా బెట్టింగ్ జోలికి పోకండి అని కోరాడు.
ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం తంబళ్లపల్లె మండలం దిగువగాలిగుట్టకు చెందిన పద్మనాభరెడ్డి బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. చేతులో డబ్బులు ఉండడంతో ఆన్ లైన్ లో బెట్టింగ్ చేశాడు. మొదట్లో డబ్బులు వచ్చాయి. ఆ తర్వాత భారీ ఎత్తున డబ్బులతో బెట్టింగ్ చేశాడు. ఈ క్రమంలో డబ్బులు పోగొట్టుకున్నాడు. అయినా బెట్టింగ్ లు మానలేదు. అప్పు చేసి మరీ బెట్టింగ్ వేశాడు.

ఆన్ లైన్ బెట్టింగ్ చేసి రూ.24 లక్షలు కోల్పోయాడు. ఏం చేయాలో తెలియని అతను అక్టోబర్ 11న మదనపల్లె మండలం సీటీఎం సమీపంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు బస్ టికెట్ బుక్ చేసుకున్నాడు. ఆ రోజు రాత్రి బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాడు. అతను మధ్యలోనే దిగిపోయాడు. రెడ్డివారిపల్లె వద్ద రైలు కింద పడి చనిపోయాడు. అక్టోబర్ 12న స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పక్కనే ఉన్న సూసైడ్ నోటు, ల్యాప్ టాప్, ఐడెంటిటీ కార్డు, మొబైల్ నంబర్ ఆధారంగా అతన్ని పద్మనాభ రెడ్డిగా గుర్తించారు.
మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. "దయచేసి ఎవరూ బెట్టింగ్ జోలికి వెళ్లకండి. బెట్టింగ్ చాలా ప్రమాదకరం. బెట్టింగ్ మాఫియా వాళ్ల ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు చెప్పినా పోలీసులు ఏమీ చేయలేరు" అని లేఖలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications