సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్నిప్రమాదం, సీఎం చంద్రబాబు సీరియస్, హెలికాప్టర్ లో డీజీపీ
భారతదేశంలోనే అతి పెద్ద డివిజన్ అయిన ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఆగ్నిప్రమాదం జరిగింది. అనేక అసెంబ్లీ నియోజక వర్గాల రికార్డులు నిల్వ చేసిన సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్దరాత్ని అనుమానాస్పద రీతిలో మంటలు వ్యాపించడం కలకలం రేపింది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జగరడంతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు.
వెంటనే మీరు మదనపల్లె వెళ్లి స్వయంగా దర్యాప్తు చెయ్యాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ డీజీపీని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ, సీఐడీ చీఫ్, ఫోరెన్సిక్ నిపుణులు విజయవాడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మదనపల్లెకు బయలుదేరారు. అన్యమయ్య జిల్లా (ఉమ్మడి చిత్తూరు జిల్లా)లోని మదనపల్లె డివిజన్ లో మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు. పుంగనూరు, పలమనేరుతో పాటు రాజంపేట లోక్ సభ నియోజక వర్గానికి చెందిన భూముల రికార్డులు ఉన్నాయి.

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో 25 రన్నింగ్ ఫైల్స్ కాలి బూడిద అయ్యాయని వెలుగు చూసింది. రాత్రి సబ్ కలెక్టర్ ఆఫీసు దగ్గరకుఆర్డీఓ మురళి సంఘటనా స్థలానికి చేరుకోవడం పలు అనుమానాలకు దారితీస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు సబ్ కలెక్టర్ కార్యాలయం వెనుక ఉండే కాంపౌడ్ వెనుకనే ఆగ్నిమాపక శాఖ కార్యాలయం ఉంది. అయితే ఆగ్నిమాపక శాఖ సిబ్బంది ఆలస్యంగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి రావడం కూడా అనుమానాలకు దారితీస్తోందని మదనపల్లె ప్రజలు ఆరోపిస్తున్నారు.
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ పుటేజీలు సేకరించి తనకు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు డీజీపీ ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారాకనాథ రెడ్డి అనుచరులే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిప్పంటించి ఉంటారని మదనపల్లెకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మదనల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం గురించి పూర్తి సమాచారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు.
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారని తెలిసింది. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజక వర్గం పరిధిలోని రాగానిల్లె పరిసర ప్రాంతాల్లోని సుమారు 980 ఎకరాల ప్రభుత్వ భూములను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అనుచరుల పేరిట రిజిస్టర్ అయ్యిందని, ఆ రికార్డులు అన్ని మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాయని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications