ఈత సరదా ప్రాణం తీసింది: అమెరికాలో యువ టెక్కీ మృతి
న్యూయార్క్: అమెరికాలోని అట్లాంటా నగరం సమీపంలోని నదిలో ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ తెలుగు యువకుడు మృత్యువాతపడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఈ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. యువకుడి మృతితో అతని కుటుంబం, స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం గ్రామానికి చెందిన చిలుకూరి కౌశిక్(25) అమెరికాలో ఎంఎస్ పూర్తిచేసుకుని ఇటీవలే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.

వారాంతంలో అట్లాంటా నగరం సమీపంలోని నదిలో ఈత కొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతదేహన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, శుక్రవారం నాటికి రావొచ్చని కుటుంబసభ్యులు తెలిపారు.
కౌశిక్ మృతిలో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మృతుని కుటుంబసభ్యులు గత కొంత కాలంగా గుంటూరులో నివాసం ఉంటున్నారు.












Click it and Unblock the Notifications