దారుణం: మర్మావయవాలు కోసి యువకుడి హత్య

శుక్రవారం ఘటనా స్థలంలోని మైదానంలో కొందరు పిల్లలు క్రికెట్ ఆడుకుంటుండగా బంతి ముళ్లపొదల్లోకి వెళ్లింది. బంతిని తీసుకొచ్చేందుకు ఓ బాలుడికి యువకుడి మృతదేహం కనిపించింది. ఆ బాలుడు పరుగెత్తుకుంటూ వచ్చి తోటివారికి చెప్పాడు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఏసిపి చెన్నయ్య, ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణారెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని విచారించారు.
డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లను రప్పించి విచారణ చేశారు. గురువారం సాయంత్రమే ఆ యువకుడ్ని హత్య చేసి, అనంతరం ఖాళీ స్థలానికి తీసుకొచ్చి ముఖాన్ని, మర్మాంగాలను పెట్రోల్ పోసి కాల్చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతుడి ఒంటిపై చిన్న చిన్న గాయాలున్నాయని, మర్మావయం కోసినట్లు ఉందని పోలీసులు చెప్పారు. మృతుడి ఒంటిపై ఎరుపురంగు గళ్ల కండువా ఉందని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించామని పోలీసులు చెప్పారు.
ఇది ఇలా ఉండగా నగర శివారులోని జన్వాడ గ్రామంలో గురువారం రాత్రి ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. మెదక్ జిల్లా రామచంద్రపురానికి చెందిన మల్లేష్, సరిత(32) దంపతులు కొంతకాలంగా శంకర్‌పల్లి మండలం జన్వాడ గ్రామంలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. తరచూ భార్యతో గొడవపడే మల్లేష్.. గురువారం రాత్రి కూడా ఆమెతో గొడవపడి మారణాయుధంతో హత్య చేసి, పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications