తనను ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకున్నాడని.. గొంతుకోసి చంపేసింది

ఖమ్మం: ప్రేమిస్తున్నానని తనకు మాయమాటలు చెప్పి మోసం చేసిన వ్యక్తిని ఓ యువతి గొంతుకోసి చంపేసింది. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. పాండురంగ అనే యువకుడు.. గతంలో ఓ యువతిని ప్రేమించానని నమ్మబలికాడు. ఆమెని సినిమాలకి, షికార్లకి తిప్పాడు. ఆ తర్వాత, వారం రోజుల క్రితం పాండురంగ మరో యువతిని వివాహం చేసుకున్నాడు.

A teengae girl allegedly murdered her lover

ఈ విషయం తెలుసుకున్న బాధిత యువతి.. పాండురంగపై కోపం పెంచుకుంది. ఈ క్రమంలో అతడ్ని లక్ష్మీనరసింహస్వామి గుట్టపైకి తీసుకెళ్లి అతని గొంతు కోసి చంపింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వేలాడుతున్న మృతదేహం

హైదరాబాద్‌ నగరంలోని సనత్‌నగర్‌ లోథా అపార్టుమెంట్‌ వద్ద ఆదివారం మధ్యాహ్నం కలకలం రేగింది. అపార్టుమెంట్‌ వద్ద ఓ చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి స్థానికులు ఆందోళన చెందారు. సమాచా రం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+