ప్రమాదం: బెంగళూరులో రైలు ఢీ, తెలుగు టెక్కీ మృతి

బెంగళూరులోని ప్రముఖ ఐటి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న అశోక్ రెడ్డికి ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. ఐటిసి ఫ్యాక్టరీ సమీపంలోని మైదానంలో రోజూ ఉదయం జాగింగ్ వచ్చే అశోక్ రెడ్డి, బుధవారం కూడా ఎప్పటిలాగే ఉదయం రైల్వే పట్టాల సమీపంలో బైక్ పార్క్ చేసి మైదానంలోకి వెళ్లాడు.
కొంత సమయంపాటు జాగింగ్ చేసిన అనంతరం ఇంటికి బయలుదేరాడు. రైలు పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొని దుర్మరణం చెందాడు. రైలు వస్తున్న విషయాన్ని గుర్తించలేకపోవడంతోనే అశోక్ రెడ్డి మృతి చెందాడని రైల్వే పోలీసులు చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.
చిత్తూరు జిల్లాలోని తొట్టంబేడు మండలం పొయ్య గ్రామం వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.












Click it and Unblock the Notifications