బోటు విషాదం: 22మంది ప్రాణాలు తీసింది అధికారుల నిర్లక్ష్యమే?(వీడియో)

Subscribe to Oneindia Telugu

విజయవాడ: కృష్ణా నదిలో పవిత్ర సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రమాదానికి ముందు బోర్డింగ్ మేనేజర్ చేసిన వ్యాఖ్యలు అధికారుల నిర్లక్ష్య దోరణికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఓరే పదండ్రా! అధికారుల కన్నా మత్స్యకారులే నయం: ప్రత్యక్షసాక్షుల మాటిది

కూతురి మరణంతో ఆగిన తల్లి గుండె: కృష్ణా ఘటనపై మోడీ దిగ్భ్రాంతి

అధికారి నిర్లక్ష్యం..

అధికారి నిర్లక్ష్యం..

ప్రమాదానికి ముందు సదరు బోటును నిర్వాహకులు దుర్గా ఘాట్ వద్ద నిలిపారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న బోర్గింగ్ మేనేజర్ బోటుకు ఎటువంటి అనుమతులు లేవని తెలిసినప్పటికీ.. బోటును నిలువరించే ప్రయత్నం చేయలేదు.

 ప్రమాదానికి ప్రధాన కారణం

ప్రమాదానికి ప్రధాన కారణం

అంతేగాక, బోటును ఈ ఘాట్ వద్ద నిలపొద్దని వేరే ఘాట్‌లో నిలుపుకోండంటూ బోటు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారే.. తప్ప తన బాధ్యతను మాత్రం మర్చిపోయారు. ఆ బోటుకు అనుమతి లేదని తెలిసినా.. సదరు అధికారి బోటును అడ్డుకోకపోవడం ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా మారింది.

అడ్డుకొనివుంటే.. 22మంది ప్రాణాలు..

ఒక వేళ సదరు అధికారి బోటును అప్పుడే నిలువరించి ఉంటే.. అసలు ఈ బోటు ప్రమాదం జరిగి ఉండేదే కాదు. 22మంది ప్రయాణికులు ప్రాణాల పోయి ఉండేవి కూడా కాదు. ఇంత మంది కుటుంబాల్లో విషాదం ఉండేదే కాదు. బోటు నిర్వాహకులు కూడా ప్రయాణికుల భద్రతను పట్టించుకోకుండా డబ్బులే లక్ష్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ పెను విషాదానికి కారణమయ్యారు.

 పునరావృతం కాకూడదంటూ..

పునరావృతం కాకూడదంటూ..

ఈ వీడియో చూసిన నెటిజన్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే 22మంది ప్రాణాలను బలితీసుకుందని మండిపడుతున్నారు. ప్రభుత్వం కూడా ప్రయాణికుల భద్రతకు సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హితబోధ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A video viral about vijayawada boat accident, before the incident.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి