విషాదం: ఎస్ఆర్ఎం వర్సిటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విషాద ఘటన చోటు చేసుకుంది. యూనివర్సిటీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న సాయినాథ్ మంగళవారం కాలేజీ హాస్టల్ భవనం మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాలేజీ యాజమాన్యం రూ.10వేల ఫైన్ విధించారని.. దీంతో మనస్థాపం చెందిన సాయినాథ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పలువురు విద్యార్థులు చెబుతున్నారు.
సాయినాథ్ స్వస్థలం విజయవాడలోని నారాయణలింగాపురం.

విద్యార్థి ఆత్మహత్యపై కాలేజీ యాజమాన్యం.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సాయినాథ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థి ఆత్మహత్య గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది ఇలా ఉండగా, రెండు నెలల క్రితం సత్యభామ యూనివర్సిటీలో చదువుతున్న రాధ మౌనిక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన మౌనిక ఇంటర్నల్ ఎగ్జామ్ సందర్భంగా కాపీ కొట్టిందనే ఆరోపణతో.. ఆమెను పరీక్ష కేంద్రం నుంచి అధ్యాపకులు బయటికి పంపారు. అంతేగాక, తదుపరి పరీక్షకు కూడా అనుమతించలేదు. దీంతో అందరిలో అవమానంగా భావించిన మౌనిక హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.












Click it and Unblock the Notifications