ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ భర్తకు చిక్కిన భార్య, ఇంట్లోనే స్పాట్ పెట్టిన కిలాడి

ప్రియుడి మోజులో పడి అతనితో కలిసి భర్తను హతమార్చిన భార్య పోలీసులకు చిక్కిన ఘటన కర్ణాటకలోని గదగ్ జిల్లా కోటుమచాగి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.

మంజునాథ్ మీసీ(30)ని అతని భార్య హత్య చేసింది. ప్రియుడి మోజులో పూర్తిగా మునిగిపోయిన భార్య అతనితో ఎంజాయ్ చేసింది. భార్య అక్రమ సంబంధం మ్యాటర్ ఆమె భర్తకు లీక్ అయ్యింది. ప్రియుడితో కలిసిన భార్య ఆమె భర్తకు స్పాట్ పెట్టింది.

మంజునాథ్ భార్య శివమ్మ అలియాస్ శివి, ఆమె ప్రేమికుడు మంజునాథ్ యలబుర్గా అలియాస్ మంజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఆగస్టు 30వ తేదీన గదగ్ జిల్లాలోని కోటుమచాగి గ్రామ సమీపంలోని హైవే రహదారిపై మంజునాథ్‌ మృతదేహం స్థానికులు చూశారు. పైకి చూస్తే ఏదో గుర్తు తెలియని వాహనం ఢీకొని మంజునాథ్ చనిపోయినట్లు కనిపిస్తోందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

A wife who killed her husband along with her boyfriend who had an illicit relationship

పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మంజునాథ్ మృతదేహాన్ని పరిశీలించగా అది ప్రమాదం కాదని గుర్తించారు. మంజునాథ్ ది హత్యగా పోలీసులు అనుమానించారు.

హత్యకు గురైన మంజునాథ్‌ సోదరుడు సురేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంజునాథ్‌ ను అతని భార్య శివమ్మ, ఆమె ప్రేమికుడు మంజు హత్య చేశారని సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు హత్యకు సంబంధించిన సాక్షాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి.

ప్రాథమిక విచారణలో ఇది ప్రమాదం కాదని, హత్యగా పోలీసులకు సమాచారం అందింది.

గదగ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ బీఎస్ నేమగౌడ తెలిపిన వివరాల ప్రకారం మంజునాథ ఆగస్టు 30వ తేదీన హత్యకు గురయ్యాడు. మంజునాథ్ హత్యకు ముందు జరిగిన స్టోరీని జిల్లా ఎస్పీ మీడియాకు చెప్పారు. శివమ్మ ప్రేమికుడు అయిన నిందితుడు మంజు ఆగస్టు 29వ తేదీ మధ్యాహ్నం ఆమె ఇంటికి వచ్చాడు.

అదే రోజు రాత్రి శివమ్మతో కలిసి భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత మంజు పదునైన వస్తువుతో మంజునాథ్ పై దాడి చేశాడు. తలకు బలమైన దెబ్బ తగలడంతో మంజునాథ్ మృతి చెందాడు. అయితే తన భర్త వాహనం ఢీకొని చనిపోయాడంటూ అందరిని నమ్మించాలని ప్లాన్ చేసిన శివమ్మ ఆమె భర్త మంజునాథ్ మృతదేహాన్ని ప్రియుడు మంజుతో కలిసి హైవే రోడ్డుపై పడేసింది. శివమ్మ ఆమె ఇంట్లో నుంచి భర్త మంజునాథ్ మృతదేహాన్ని తీసుకెళ్లిన సమయంలో రోడ్డుపై రక్తపు మరకలు పడ్డాయి. రక్తపు మరకలు పోలీసులకు కనిపించాయి.

సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించినప్పటికీ కొన్ని సాక్షాలను, సమాచారాన్ని పోలీసులు సేకరించారు. హత్యానంతరం ఏమీ తెలియనట్లు శివమ్మ ఇంట్లోనే ఉండిపోయింది. అయితే మొదటి నిందితుడు మంజు భయంతో అప్పటికే తప్పించుకున్నాడు.

నిందితులు ఇద్దరి గురించి పోలీసులు ఆరా తీసి వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+