Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెడ్ రూమ్ లో ప్రియుడితో కలిసి రోమాన్స్ చేస్తూ భర్తకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య, సీన్ కట్ చేస్తే ?

ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరు వచ్చి భర్తతో కలిసి వచ్చి స్థిరపడిన నందిని ఆమె ప్రేమికుడితో కలిసి రాసలీలు ఆడుతూ భర్తకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. ఇదే సమయంలో నందిని భర్త అనుమానస్పద స్థితిలో శవమై కనిపించాడు. తన భర్త రాత్రి పీకలదాక మద్యం సేవించి వచ్చి అర్దరాత్రి బాత్ రూమ్ కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడని భార్య మంచి సినిమా స్టోరీ ఒకటి చెప్పింది.

అయితే తరువాత పోలీసుల విచారణ జరపడంతో ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లాలో నివాసం ఉండే వెంకటరమణ (30) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడని వెలుగు చూసింది. వెంకటరమణ భార్య నందిని ఆమె ప్రేమికుడితో చేరి భర్త తలపై బండరాయితో కొట్టి హత్య చేసిందని వెలుగు చూడటంతో అందరూ బిత్తరపోయారు. తన భర్తకు గుండెపోటు వచ్చిందని నందిని పోలీసు హెల్ప్‌లైన్ 112కి కాల్ చేసింది.

A wife who was romancing her boyfriend from Andhra Pradesh ended up killing her husband and playing drama

పోలీసుల విచారణలో మైండ్ బ్లాక్ అయ్యే సమాచారం బయటకు వచ్చింది. తన భర్త వెంకటరమణ ఇంట్లో లేడని, నువ్వు వస్తే మనం సరదాగా గడుపుదాం అంటూ నందిని ఆమె ప్రేమికుడు నితీష్ కు జనవరి 6వ తేదీన ఫోన్ చేసింది నా మొగుడు ఆంధ్రాకు వెళ్లాడని, నువ్వు మా ఇంటికి రావాలని నందిని ఆమె ప్రియుడు సతీష్ ను ఇంటికి పిలిపించింది. మొగుడు ఇంట్లో లేకపోవడంతో రాత్రి నందిని ఆమె ప్రియుడు సతీష్ ఇంటి తలుపు లాక్ చెయ్యకుండా మస్త్ మజా చేస్తూ మంచి మూడ్ లో ఉన్నారు.

ఆ సమయంలో నందిని భర్త వెంకటరమణ అకస్మాత్తుగా ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో నందిని, ఆమె ప్రియుడు సతీష్ ఇద్దరూ బెడ్ రూమ్ లో ఉండటాన్ని గమనించిన భర్త వెంకటరమణ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఆ సందర్బంలో వెంకటరమణ అతని భార్య నందినిని పట్టుకుని చితకబాదేశాడు. ఆ సమయంలో నందిని, ఆమె ప్రియుడు సతీష్ ఇద్దరూ కలిసి వెంకటరమణను కందపడేసి అతని తలపై బండరాయి వేసి హత్య చేశారు.

A wife who was romancing her boyfriend from Andhra Pradesh ended up killing her husband and playing drama

మృతదేహాన్ని ఇంటి బయట మరుగుదొడ్డి సమీపంలో పడేసిన నందిని, ఆమె ప్రియుడు వెంకటరమణ సహజంగా మరణించాడనే సీన్ సృష్టించారు. పదునైన రాయి మీద వెంకటరమణ పడినట్లు అతని భార్య నందిని సీన్ క్రియేట్ చేసింది. ఉదయం తన భర్త వెంకటరమణ చనిపోయాడని నందిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తొలుత అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. వెంకటరమణ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా అది హత్యగా తేలింది.

పోలీసులు కూడా ఘటనాస్థలిని పరిశీలించగా వెంకరమణది హత్యగా అనుమానించారు. పోలీసుకు వెంకరమణ భార్య నందిని మీద అనుమానం వచ్చి ఆమెపై నిఘా పెట్టారు. పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత నందిని గురించి పోలీసులు ఆరా తీస్తే షాక్ అయ్యారు. నేను నా భర్తను కోల్పోయిన బాధలో ఉన్నానని, నాపైన మీకు అనుమానం ఉందా అంటూ నందిని డ్రామాలు ఆడింది. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించగా నందిని అసలు విషయం బయటపెట్టింది.

A wife who was romancing her boyfriend from Andhra Pradesh ended up killing her husband and playing drama

తన ప్రేమికుడు సతీష్‌ తో కలిసి తన భర్త వెంకటరమణను హత్య చేశానని నందిని అంగీకరించింది. సతీష్, నందిని ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి తాలూకాకు చెందినవారని, చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉంటూ ఆ తర్వాత ప్రేమలో పడ్డారని బెంగళూరు పోలీసులు తెలిపారు. పెళ్లి తర్వాత నందిని కుటుంబం బెంగళూరు వచ్చి స్థిరపడిందని, వెంకటరమణను పెళ్లి చేసుకున్న తరువాత నందిని బెంగుళూరులో స్థిరపడిందని పోలీసులు అన్నారు.

అయితే పాత ప్రేమికుడు సంతోష్ ను విడిచిపెట్టేందుకు నందికి మనసు రాలేదని, దాంతో భర్త వెంకటరమణ ఇంట్లో లేని సమయంలో ప్రేమికుడిని ఇంటికి పిలిపించుకుంటున్న నందిని అతనితో రొమాన్స్ చేస్తూ ఆమె కోరికలు తీర్చుకుంటున్నదని పోలీసులు అన్నారు. నిందితుడు సతీష్ అతని ప్రియురాలి కోసం ఆంధ్రా నుంచి బెంగళూరులో వచ్చి హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌ లోని ఆమె ఇంటికి వచ్చి వెళ్లేవాడని, చివరికి ప్రియురాలు నందినితో కలిసి ఆమె భర్తను చంపేశారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నందిని, ఆమె ప్రియుడు సతీష్ ను హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+