తాగొచ్చిన భర్తను చంపి.. ఇంటిముందే పాతేసింది
గుంటూరు: అతిగా మద్యం సేవించడమేగాక, ఇంటికొచ్చి కుటుంబసభ్యులపై దాడికి దిగిన ఓ తాగుబోతు భర్తను కన్నబిడ్డల సాయంతో ఓ భార్య చంపేసింది. ఆ తర్వాత అతని మృతదేహాన్ని ఇంటి ముందే పాతి పెట్టింది. గుంటూరు జిల్లా నగరం మండలం అద్దంకివారిపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అద్దంకిపాలెంకు చెందిన అద్దంకి రెడ్డంకయ్య (50) జనవరి 14 రాత్రి అతిగా మద్యం తాగి భార్య, పిల్లలను వేధించాడు. దీంతో ఆగ్రహానికి గురైన భార్య రాధ రోకలిబండతో మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి సమయంలో తమ ఇంటిముందే అతడి మృతదేహాన్ని పూడ్చి పెట్టారని పోలీసులు తెలిపారు.

భార్యను హత్య చేసిన భర్త
గుంటూరు రూరల్ మండల పరిధిలోని వెంగళాయపాలేం దారుణం జరిగింది. గ్రామానికి చెందిన నెలకుర్తి రావమ్మ(43)ను ఆమె భర్త పుష్పరాజు బుధవారం హత్య చేశాడు. మద్యానికి బానిసైన పుష్పరాజు భార్య కూలీకి వెళ్లి తెచ్చే డబ్బులను సైతం తన తాగుడు కోసం తీసుకుంటున్నాడు.
ఈ క్రమంలో బుధవారం రాత్రి వీరిద్దరూ గొడవపడ్డారు. అనంతరం రావమ్మ నిద్ర పోతుండగా పుష్పరాజు పచ్చడిబండ తీసుకుని ఆమె తలపై మోదాడు. దీంతో ఆమె మృతి చెందింది. పుష్పరాజు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం... యువకుడి మృతి
ప్రేమికులు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం బడేపురంలో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో యువకుడు మృతి చెందాడు. బడేపురానికి చెందిన నామాల సాంబశివరావు (21) గత కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమిస్తున్నాడు.
విషయం తెలుసుకున్న తండ్రి బాబూరావు.. సాంబశివరావును మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాబూరావు, ఆ మైనర్ బాలిక పురుగుల మందు తాగారు. ఆస్పత్రిలో సాంబశివరావు మృతి చెందగా, బాలిక చికిత్స పొందుతోంది.












Click it and Unblock the Notifications