కన్న కొడుకులను బావిలో పడేసిన తల్లి: కుటుంబం ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్: కుటుంబ కలహాలతో కన్నతల్లే తన ఇద్దరు కొడుకులను బావిలో పడేసి చంపేసింది. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా మాట్లూరు మండలం వెనుకీసాన్‌నగర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వెనుకీసాన్‌నగర్ గ్రామానికి చెందిన వెంకట్, లక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు చరణ్(3), వరుణ్(2).

వెంకట్ దుబాయ్‌లో పని చేసేవాడు, కాగా, నెల రోజుల క్రితమే దుబాయి నుంచి ఇంటికి వచ్చాడు. ఇతను వచ్చినప్పటి నుంచి కుటుంబంలో తరచూ కలహాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే భార్య తన ఇద్దరు కొడుకులను తీసుకెళ్లి వ్యవసాయ బావిలో పడేసింది. నీటిలో మునిగిన ఇద్దరు పిల్లలు మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని పిల్లల మృతదేహాలను బయటికి తీశారు. ఆ తర్వాత పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

A woman allegedly murdered her two sons in Nizamabad district

కిరోసిన్ పోసుకుని కుటుంబం ఆత్మహత్యాయత్నం

నల్గొండ: క్షణికావేశంలో ఓ కుటుంబమంతా కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన మక్సూదాకు ముగ్గురు కూతుళ్లు నసీమా, ఆస్మా, కాజల్, ఓ కుమారుడు లియాఖత్ ఉన్నారు. మక్సూదా భర్త జహంగీర్ హైదరాబాద్‌లో వెల్డింగ్ పని చేస్తున్నాడు.

కూతుళ్లు నసీమా,ఆస్మా పట్టణంలోని బ్యాంగిల్‌స్టోర్స్‌లో పనిచేస్తున్నారు. చిన్నకూతురు పదోతరగతి పరీక్షలు రాస్తోంది. లియాఖత్ పెయింటింగ్ పనిచేస్తున్నాడు. కాగా, మనస్పర్థల కారణంగా శుక్రవారం రాత్రి తల్లితోపాటు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు.

అరుపులు విని ఇరుగుపొరుగు వచ్చి మంటలార్పి మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. మక్సూదా, నసీమా, ఆస్మా పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. మిర్యాలగూడ న్యాయ మూర్తి బాధితుల వాంగ్మూలం నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+